హోమ్ /వార్తలు /సినిమా /

రేషన్‌కు లేని డబ్బు.. లిక్కర్‌కు ఎక్కడిది.. రష్మి గౌతమ్ ప్రశ్న..

రేషన్‌కు లేని డబ్బు.. లిక్కర్‌కు ఎక్కడిది.. రష్మి గౌతమ్ ప్రశ్న..

Instagram

Instagram

Rashmi Gautam: అసలే పనులు లేవు.. చేతిలో డబ్బులు లేవు.. మాకు తినడానికి కూడా తిండి లేదు.. ఉచిత రేషన్ కావాలి అంటూ ప్రభుత్వాన్ని అడిగే వాళ్లు కూడా ఇప్పుడు మందు కోసం లైన్‌లో నిలబడ్డారు.

లాక్‌డౌన్‌ 3.0లో భాగంగా కేంద్రం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరచుకున్నాయి. దీనిపై మిశ్రమ స్పందన వస్తుంది. ముఖ్యంగా కొందరు సెలబ్రిటీస్ బాహాటంగానే తమ నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వానికి ఆదాయం కావాలనే ఒకే ఒక్క ఉద్ధేశ్యంతో కరోనాను కూడా పట్టించుకోకుండా ఇలా మద్యం షాపులు తెరిస్తే ఎవరికి నష్టం అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి. దాంతో ఈ మందు కొనుక్కోడానికి మందు బాబులు మద్యం షాపులకి బారులు తీరుతున్నారు.


అయితే అసలే పనులు లేవు.. చేతిలో డబ్బులు లేవు.. మాకు తినడానికి కూడా తిండి లేదు.. ఉచిత రేషన్ కావాలి అంటూ ప్రభుత్వాన్ని అడిగే వాళ్లు కూడా ఇప్పుడు మందు కోసం లైన్‌లో నిలబడ్డారు. ఇదే అందరికీ షాక్ ఇస్తుంది. మరి తినడానికి లేవు కానీ తాగడానికి మాత్రం ఎక్కడ్నుంచి డబ్బులు వస్తున్నాయంటూ అంతా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మందు బాబులపై సోషల్ మీడియాలో యాంకర్ రష్మీ ఫైర్ అయింది. మద్యం కోసం బయటకు వచ్చే ప్రతీ ఒక్కరిపై స్టాంప్ వేయాలని.. అలాంటి వాళ్లకి ఎవ్వరూ సాయం చేయొద్దని ఆమె కోరింది. ప్రభుత్వం నుంచి అందే ఏ సాయం కూడా అతనికి చేరొద్దని తెలిపింది.


కనీసం అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులుండవు.. కానీ మందు తాగడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయ్ అంటూ రష్మీ ఫైర్ అయింది. అచ్చంగా ఈమె మాదిరే చాలా మంది ప్రశ్నిస్తున్నారు. పనుల్లేవు.. డబ్బుల్లేవని వాపోతున్న వాళ్లంతా ఇప్పుడు తాగడం కోసం ఎక్కడ్నుంచి డబ్బులు తీసుకొస్తున్నారంటూ అడుగుతున్నారు. తిండి కోసం దాచుకున్న డబ్బులు కూడా తాగడానికి తెస్తున్నారంటూ ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దాడికి దిగుతున్నాయి. యాంకర్ రష్మి గౌతమ్ కూడా ఇదే ప్రశ్నిస్తుంది. మరి దీనికి సమాధానం ఎవరిస్తారో చూడాలిక.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Anchor rashmi gautam, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు