Home /News /movies /

RASHMI GAUTAM FEELS ABOUT THAT INCIDENT NK

ఫీలైపోతున్న రష్మీగౌతమ్... అలా జరుగుతోందనీ...

రష్మీ గౌతమ్ (Instagram/Rashmi Gautam)

రష్మీ గౌతమ్ (Instagram/Rashmi Gautam)

Rashmi Gautham : మనకు తెలుసు... జబర్దస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్‌లో దయాగుణం ఎక్కువని. అందుకు తగ్గట్టే ఓ ఘటనపై ఆమె బాగా ఫీలైపోతోంది.

    Rashmi Gautam : ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షోలో... స్కిట్లలో జంతువులు, ప్రాణులకు ఏదైనా హాని జరిగే సీన్ ఉంటేనే తట్టుకోలేని యాంకర్ రష్మీ గౌతమ్... రియల్ లైఫ్‌లో మూగ జీవాలకు ఏమైనా అయితే అస్సలు తట్టుకోలేకపోతోంది. తెగ ఫీలవుతూ... తన బాధను తన ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఇప్పటికే... కుక్కలు, మూగ జీవాలకు జరుగుతున్న అన్యాయాలపై ఎన్నోసార్లు స్పందించిన రష్మీ గౌతమ్... తాజాగా ఆస్ట్రేలియాలో కార్చిచ్చుపై స్పందించింది. అక్కడి కార్చిచ్చు వల్ల మనుషులతోపాటూ... మూగ జీవాల ప్రాణాలు కూడా పోతున్నాయని ఫీలవుతోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాకు పెట్టింది పేరైన కంగారూలు... మంటల్లో చిక్కుకొని... చనిపోతుండటంపై రష్మీ చాలా ఫీలవుతోంది. అందుకు సంబంధించిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది.

    ఫీలైపోతున్న రష్మీగౌతమ్... అలా జరుగుతోందనీ... (credit - insta - rashmigautam)





    రష్మీ ఇలా స్పందించడంలో ఏమాత్రం తప్పు లేదు. ఎందుకంటే... ఆస్ట్రేలియా కార్చిచ్చు వల్ల సెప్టెంబర్ నుంచీ ఇప్పటి వరకూ 23 మంది ప్రజలు చనిపోయారు. 1200 ఇళ్లు, లక్షల హెక్టార్ల పంటలు కాలిబూడిదయ్యాయి. ఇక ప్రాణాలు కోల్పోయిన జంతువులు, పక్షులకు లెక్కలేదు. వాటిని లెక్కించే పరిస్థితి కూడా అక్కడ లేదు. న్యూసౌత్‌వేల్స్‌ని కాల్చేస్తున్న మంటలకు గంటకు 125 కిలోమీటర్ల వేగంతో వస్తున్న గాలులు తోడై... పరిస్థితి దారుణంగా ఉంది. పక్కనే ఉన్న విక్టోరియాలో ఆర్మీ హెలీకాప్టర్లు మంటల్లో చిక్కుకున్న వారిని అక్కడి నుంచీ తరలిస్తున్నాయి. మంటల్ని ఆర్పేందుకూ, ప్రజలను రక్షించేందుకు 3వేల రిజర్వ్ ట్రూప్స్ శ్రమిస్తున్నాయి.




    ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ మంటల వల్ల న్యూఇయర్‌కి ఆస్ట్రేలియాకి వచ్చే విదేశీ టూరిస్టులు... ఈ సంవత్సరం పెద్దగా రాలేదు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. కొన్ని చోట్ల 48 డిగ్రీలు కూడా నమోదైంది. మంటలు ఎప్పటిలోగా అదుపులోకి వస్తాయో... అంచనాకి అందట్లేదు. ఈ పరిస్థితుల్లో కంగారూలు, ఇతర ప్రాణులు... మంటల్లో చిక్కుకొని, ఆహారం, నీరూ దొరకక చనిపోతున్నాయి.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Anchor rashmi gautam, Australia, Jabardasth comedy show, Jabardasth rashmi

    తదుపరి వార్తలు