హోమ్ /వార్తలు /సినిమా /

పూర్ణకు ముద్దు పెట్టబోయిన సుధీర్...ఫీల్ అయిపోయిన రష్మీ... రోజా సీరియస్

పూర్ణకు ముద్దు పెట్టబోయిన సుధీర్...ఫీల్ అయిపోయిన రష్మీ... రోజా సీరియస్

సుధీర్‌ను అలా చూడలేక రష్మీ ఆవేదన

సుధీర్‌ను అలా చూడలేక రష్మీ ఆవేదన

పూర్ణ గారు కొరికితే మాత్రం నేను ఫీల్ అవుతా.. ఐ కెనాట్ ఎలో దిస్’ అంటూ రష్మీ ఫీల్ అయిపోయింది. అయితే సుధీర్ మాత్రం పూర్ణ దగ్గరకు వెళ్తాడు.

జబర్దస్త్ షో గురించి వేరేగా చెప్పాల్సిన పనిలేదు. షో అంతా నవ్వులే నవ్వులే. ఒకరిపై ఒకరు పంచ్‌లే పంచ్‌లు,యాంకర్లు, జడ్జీలను సైతం వదలకుండా తమ స్కిట్స్‌లో ఇన్ వాల్వ్ చేసేస్తూ.. జబర్దస్త్ కమెడియన్లు అందరి చేత నవ్వులూ పూయిస్తారు. ఇక ఈ షోలో కామెడీలు చేసే కమెడియన్లు ఎంత పాపులర్ అవుతారో.. జబర్దస్త్ షోకు వచ్చే జడ్జీలు, యాంకర్లు సైతం అంతే పాపులర్ అవుతారు. జబర్దస్త్ షో జడ్జీలు రోజా, పూర్ణ, ఇంద్రజ, మను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్కిట్స్‌లో వీళ్లు కూడా అప్పుడప్పుడు తమ మార్క్ చూపిస్తుంటారు. ఇక తాజాగా జరిగిన ఎక్సట్రా జబర్దస్త్‌ ఎపిసోడ్‌లో కమెడియన్ సుడిగాలి సుధీర్‌కు పూర్ణకు మధ్య ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది.

సుధీర్ చేసిన స్కిట్ పూర్తవ్వగానే.. పూర్ణ, రోజా వారిపై ప్రశంసలు కురిపించారు. ఇందులో సుడిగాలి టీంలో ఒక వ్యక్తి పూర్ణకు ముద్దు అడుగుతాడు. దీంతో పూర్ణ వచ్చి రాని తెలుగులో ఇప్పుడు సుడిగాలి సుధీర్ నన్ను కొరుకుతాడా ? అంటూ ప్రశ్నిస్తోంది. అవును అంటూ సుధీర్ పూర్ణ దగ్గరకు వెళ్తాడు. ఇంతలో రష్మీ సీరియస్ అవుతుంది. సుధీర్ వెళ్తుంటే అతడ్ని చూసి ఫీల్ అయిపోతుంది. ‘పూర్ణ గారు కొరికితే మాత్రం నేను ఫీల్ అవుతా.. ఐ కెనాట్ ఎలో దిస్’ అంటోంది రష్మి. దీంతో పూర్ణను ముద్దు పెట్టేందుకు సుధీర్ దగ్గరకు వస్తాడు. ఆ పక్కనే ఉన్న రోజా... ఇలాంటివి నేను చూడలేనంటూ కళ్లుమూసుకుంటుంది. సుధీర్ టీం వాళ్లు.. అన్నా కొరుకన్నా అంటూ అతడ్ని సపోర్ట్ చేస్తుంటారు. రష్మీ ఫేస్ ఫీలింగ్స్ అన్నీ మారిపోయాయి. ఒకరకమైన ఫీలింగ్‌తో రష్మీ తలదించేసుకుంటుంది. ఇంతలో పక్కనే ఉన్న రోజా గారు.. సుధీర్‌ను చూస్తూ.. చేయి చూపిస్తూ వార్నింగ్ ఇస్తారు. దీంతో సుధీర్ ఆగిపోతాడు. అక్కడితో ఆ సీన్ పూర్తవుతోంది.

అయితే ఈ ఎపిసోడ్‌లో మనం చూస్తుంటే.. రష్మీ, సుధీర్ మధ్య ఏదో నడుస్తుందన్న విషయం మాత్రం క్లారిటీ వస్తుంది. రష్మీ నిజంగా.. చాలా ఫీల్ అవుతూ కనిపిస్తుంది. మరి సుడిగాలి సుధీర్, రష్మీ మధ్య నిజంగా ఏదైనా రిలేషన్ షిప్ నడుస్తుందా ? అన్న డౌట్ ఇప్పటికే జనాల మెదడులో పేరుకుపోయింది.దీనికి తోడు వీరిద్దరూ ఆన్ స్క్రీన్ చేసిన ప్రాంక్‌లు, వీడియోలు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఏదీ ఏమైనా.. తాజా ఎపిసోడ్‌లో మాత్రం సుధీర్ పూర్ణకు ముద్దుపెట్టేందుకు వెళ్తుంటే.. రష్మీ కళ్లలో కోపాన్ని, ఓ రకమైన బాధను మనం గమనించవచ్చు.

First published:

Tags: Anchor rashmi gautam, Extra jabardasth, Extra jabardasth promo, Sudigali sudheer, Sudigali Sudhir

ఉత్తమ కథలు