రష్మి గౌతమ్‌ను ఇబ్బందుల పాలు చేసిన ఆ ఇద్దరు.. ఇంతకీ ఎవరంటే..

తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. అంత పాపులర్ ఈ భామ. ఈ భామను కెరీర్ స్టార్గింగ్ ఒక డైరెక్టర్, మరియు ప్రొడ్యూసర్ తీవ్ర ఇబ్బందులపాలు చేసినట్టు ఓ షాకింగ్ వార్త బయటకు వచ్చింది.

news18-telugu
Updated: May 25, 2020, 7:19 AM IST
రష్మి గౌతమ్‌ను ఇబ్బందుల పాలు చేసిన ఆ ఇద్దరు.. ఇంతకీ ఎవరంటే..
రష్మీ గౌతమ్(Rashmi Gautam/Twitter)
  • Share this:
తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. అంత పాపులర్ ఈ భామ. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. ఆ మధ్య రష్మీ నటించిన 'గుంటూరు టాకీస్' కేవలం రష్మీ పేరు.. తన అందచందాలతోనే హిట్ అయ్యిందని చెబుతారు..ఆమె అభిమానులు. అది అలా ఉంటే రష్మీ వీలున్నప్పుడల్లా.. ఫోటోషూట్‌లు చేస్తూ.. కుర్రకారు మతిపోయేలా చేస్తోంది. తాజాగా ఈమె లాక్‌డౌన్ సందర్భంగా ఆకలితో అలమటిస్తోన్న జంతువులకు ఇంట్లో వంట వండి వాటికి పెడుతోంది. దాంతో ఖాళీ సమయాల్లో అభిమానులతో చిట్‌చాట్ చేస్తూ ఉంది రష్మీ గౌతమ్. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన రష్మీగౌతమ్ .. ఇద్దరు వ్యక్తులు తనను ఎంతో ఇబ్బంది పెట్టారనే వార్త షాకింగ్‌కు గురి చేస్తోంది.

rashmi gautam news,rashmi gautam latest pics,rashmi gautam movies,rashmi,jabardasth rashmi,rashmi gautam age,anchor rashmi gautam,rashmi gautham,anchor rashmi,rashmi gautam real life,rashmi gautam interview,rashmi gautam biography,rashmi gautam exclusive interview,rashmi gautam songs,rashmi gautam family,rashmi gautam videos,rashmi gautam new movie,rashmi gautam net worth,rashmi gautam lifestyle,rashmi gautam video songs,rashmi sudheer,జబర్దస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్,రష్మీ గౌతమ్ పిక్స్
రష్మి గౌతమ్ (Instagram/Photo)
తాజాగా రాకేష్ మాస్టర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడతూ.. మోడల్‌గా కెరీర్‌గా ప్రారంభించిన రష్మిగౌతమ్‌కు సినిమాల్లో సరైన అవకాశాలు రాలేదు. ఆ తర్వాత జబర్ధస్త్ ప్రోగ్రామ్‌లో యాంకర్‌గా పాపులర్ అయిందన్నాడు. అంతేకాదు ఆమెకు అణు మాత్రం గర్వం కూడా లేదన్నాడు. అంతేకాదు నేను ‘ఢీ’ ప్రోగ్రామ్ చేస్తున్నప్పటి నుంచి రష్మి గౌతమ్ తెలుసన్నారు. ఆమె నాకు బిడ్డ లాంటిదన్నారు. రష్మి గౌతమ్ కెరీర్ స్టార్ట్ చేసినపుడు ఓ ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఆమెను తీవ్ర ఇబ్బందుల పాలు చేసినట్టు చెప్పుకొచ్చాడు. అందుకే ఆమె సినిమాల వైపు కాకుండా .. జబర్ధస్త్ వంటి ప్రోగ్రామ్స్‌ చేస్తూ వస్తుందంటూ చెప్పుకొచ్చాడు. ఐతే.. ఆమెను ఇబ్బందుల పాలు చేసిన డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవరనేది మాత్రం అతను చెప్పలేదు.

Published by: Kiran Kumar Thanjavur
First published: May 25, 2020, 7:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading