Rashmi Gautam: కొత్త యేడాదిలో రష్మr గౌతమ్ జబర్దస్త్ నిర్ణయాలు తీసుకోనుంది. అందుకోసం పెద్ద స్కెచ్చే వేసింది. వివరాల్లోకి వెళితే.. జబర్దస్త్ కామెడీ షో ఎంతో మంది జీవితాలు పూర్తిగా మారిపోయాయి . అందులో ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ ఒకరు. తోటి యాంకర్ అనసూయకు ధీటుగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. జబర్ధస్త్‌కు ముందు రష్మి కొన్ని సినిమాల్లో నటించినా ఈ అమ్మడుకు అంతగా కలిసి రాలేదు. కానీ జబర్దస్త్ తర్వాత ఆమె కెరీర్ పూర్తిగా ఛేంజ్ అయిపోయింది. హీరోయిన్‌గా ఆమె డేట్స్ కోసం నిర్మాతలు ఎగబడే స్థాయికి వచ్చేసింది పరిస్థితి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అటు సినిమాలు.. ఇటు టెలివిజన్ షోలు చేస్తుంది. కానీ సక్సెస్ మాత్రం టీవీ తెరపై మాత్రమే వస్తుంది. వెండితెరపై హీరోయిన్‌గా రాణిద్దామనుకున్న రష్మిగౌతమ్ ఆశలు అడియాసలే అయ్యాయి. అందుకే ఇప్పటి నుంచి సినిమాలో నటించే ముందు పారితోషకంతో పాటు కంటెంట్ బాగుంటేనే సినిమాల్లో యాక్ట్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
ఏ స్టోరీ పడితే ఆ స్టోరీని ఒకే చేయకుండా... పూర్తిగా స్క్రిప్ట్‌తో పాటు తన పాత్ర నచ్చితేనే సినిమాలను ఓకే చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ యేడాది రష్మి గౌతమ్.. నందుతో కలిసి ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సినిమా సమ్మర్‌లో విడుదల కానుంది. ఈ సినిమాపై రష్మి గౌతమ్ చాలా ఆశలే పెట్టుకుంది. ఈ సినిమాలో గ్లామర్ పాత్ర కాకుండా.. నటనకు అవకాశం ఉన్న పాత్రలో రష్మి గౌతమ్ కనపించనున్నట్టు సమాచారం.
మరోవైపు రష్మిగౌతమ్.. టీవీ షోస్,సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇప్పటికే కొన్ని సెట్స్ పైన ఉన్నాయి. వెబ్ సిరీస్‌లు చేయడానికి వెనక పెద్ద రీజనే ఉంది. సినిమాలైతే సెన్సార్ ఉంటుంది. కానీ వెబ్ సిరీస్ విషయంలో అలాంటి హద్దులే ఉండవు.. పైగా అందరికీ ఈజీగా చేరువయ్యే మాధ్యమం ఇప్పుడు వెబ్ సిరీస్ మాత్రమే. పెద్ద పెద్ద స్టార్సే ఇందులో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో ఇప్పుడు తను కూడా ఇదే చేయాలని ఫిక్సైపోయింది ఈ ముద్దుగుమ్మ. దీనికి అన్నీ సిద్ధం చేసుకుంటుంది. పైగా పారితోషికం కూడా భారీగానే వస్తుంది కాబట్టి అసలు అందులో కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు.
తెలుగులో ఇప్పటి వరకు చాలా మంది హీరోయిన్స్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే సమంత.. ‘ఫ్యామిలీ మెన్’ సీజన్ 2 వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేసింది. ఫిబ్రబరి 12న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు కాజల్, తమన్నాలు కూడా హాట్ స్టార్ వెబ్ సిరీస్‌లో దర్శనమిస్తున్నారు. మొత్తంగా పెద్ద హీరోయిన్సే వెబ్ సిరీస్‌ల వైపు అడుగులు వేస్తుంటే.. వాళ్ల బాటలోనే రష్మి గౌతమ్.. వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేస్తోంది. పైగా స్టోరీ కంటెంట్ కూడా అడల్ట్ టచ్‌తో ఉంటుందని తెలుస్తుంది. మరి రష్మిదెబ్బకు స్క్రీన్ ఎంత వేడెక్కనుందో చూడాలి. మరోవైపు రష్మి గౌతమ్.. ఈ యేడాది పెళ్లి చేసుకోని సెటిల్ అవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అనసూయ, సుమ మాదిరే తను కూడా పెళ్లి తర్వాత యాంకర్‌గా తన కెరీర్‌ను కొనసాగించాలనే నిర్ణయానికి ఈ 2021లో వచ్చినట్టు సమాచారం. మొత్తానికి 2021లో రష్మి గౌతమ్ భారీ ప్లాన్‌తోనే రంగంలోకి దిగబోతున్న విషయం దీన్నిబట్టి తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jabardasth comedy show, Rashmi Gautam, Telugu Cinema, Tollywood