Rashmi Gautam : తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. అంత పాపులర్ ఈ భామ. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. ఆ మధ్య రష్మీ నటించిన 'గుంటూరు టాకీస్' కేవలం రష్మీ పేరు.. తన అందచందాలతోనే హిట్ అయ్యిందని చెబుతారు..ఆమె అభిమానులు. అది అలా ఉంటే రష్మీ వీలున్నప్పుడల్లా.. ఫోటోషూట్లు చేస్తూ.. కుర్రకారు మతిపోయేలా చేస్తోంది. తాజాగా కొన్ని పిక్స్ పోస్ట్ చేసింది రష్మీ.. ఆ ఫోటోలో ఈ ముద్దుగుమ్మ... అలా పైకి మత్తుగా చూస్తూ... సూర్యరశ్మీని ఎంజాయ్ చేస్తూ.. పరవశంలో మునిగితేలుతున్నట్లుగా ఉంది. దీంతో ఆమె అభిమానులు, నెటిజన్స్... ఆ ఫోటోపై తెగ కామెంట్స్ పెడుతున్నారు. రష్మీ సూపర్, పిక్ అదుర్స్.. అంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
ప్రస్తుతం రష్మీ కెరీర్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. ఓ పక్క ఇటూ టీవీల్లో వివిధ కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూనే.. అవకాశం వచ్చినప్పుడల్లా.. సినిమాలు చేస్తూ.. అదరగొడుతోంది. అయితే రష్మీకి ఉన్న ఈ క్రేజ్, యూత్‌లో ఇంత ఫాలోయింగ్ కోసం మాత్రం ఈ ముద్దుగుమ్మ చాలా కష్టపడాల్సీ వచ్చింది. సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ.. రియాలిటీ టీవీ షోలో పాల్గొనడం ఇలా.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రస్తుత స్థానాన్ని చేరుకుని తన కెరీర్లో బెస్ట్ టైమ్‌ను ఎంజాయ్ చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.