ఓ నెటిజన్ చేసిన పనికి రష్మీ గౌతమ్ హర్ట్ అయింది. అంతేకాదు సదరు ఆకతాయి చేసిన పనిని ట్విట్టర్‌లో కేంద్ర మంత్రి మేనక గాంధీకి ట్యాగ్ చేసింది. వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియా అందుబాటులతోకి వచ్చాకా సామాన్యులకు, సెలబ్రిటీల మధ్య దూరం చెరిగిపోయింది. ఆన్ లైన్ వేదికగా ఉపయోగించుకుంటూ తమ తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకుంటున్నారు. ఇటు సెలబ్రిటీలకు మధ్య దూరం చాలా వరకు తగ్గిపోయింది. ఆన్‌లైన్ వేదికగా సెలబ్రిటీలు సందేశాలు పెట్టడం సులువైపోయింది. దానికి నెటిజన్లు అదే రీతిలో రెస్పాన్స్ అవుతున్నారు. తాజాగా రష్మీ గౌతమ్.. ఓ నెటిజన్ చేతిలో ఉన్న ఓ కుక్కను ఎంతో కర్కశంగా నీటి గుంటిలో పడేసాడు. ఆ తర్వాత ఆ కుక్క తిప్పలు పడి బయటపడింది అదే వేరే సంగతి. ఈ సందర్భంగా రష్మీ గౌతమ్ ట్వీట్ చేస్తూ.. కుక్కలకు నోరు లేదని మనుషులు ఏదంటే అది చేయడం భావ్యం కాదు. సదురు పని చేసిన ఆ నెటిజన్‌ను పట్టుకోవాలని మాజీ కేంద్ర మంత్రి మేనక గాంధీకి ఆ వీడియోను ట్విట్టర్‌లో ట్యాగ్ చేసింది.
Man
Humans deserve to be extinct @Manekagandhibjp @AskAnshul pls tag people who you guys think can help https://t.co/zM23p0iExI
— rashmi gautam (@rashmigautam27) April 7, 2020
రష్మీ గౌతమ్ విషయానికొస్తే.. ఆమెకు స్వతహాగా జంతువులంటే ఎంతో ఇష్టం. ఎపుడు వీలైతే వన్య ప్రాణులను కాపాడాలంటూ ట్వీట్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు దీపావళి, హోలి వంటి పండగలు వచ్చినపుడు మన మందరం వాటికి తక్కువ హాని కలిగిలా పటాకులు, రంగులు జల్లు కోవాలని గతంలో పలుమార్లు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే కదా. తాజాగా రష్మీ గౌతమ్ చేసిన ట్వీట్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jabardasth comedy show, Rashmi Gautam, Telugu Cinema, Tollywood