తెలుగు టీవీ ఛానెల్స్ చూసే ప్రేక్షకులకు రష్మీ గౌతమ్ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. అంత పాపులర్ ఈ భామ. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. ఆ మధ్య రష్మీ నటించిన 'గుంటూరు టాకీస్' కేవలం రష్మీ పేరుతో పాటు.. ఈ సినిమాలో ఆమె ఆరబోసిన అందచందాలతోనే హిట్ అయ్యిందని చెబుతారు..ఆమె అభిమానులు. రష్మీ కేవలం సినిమాలు, సీరియల్స్, రియాల్టీ షోలకే పరిమితం కాకుండా... సమాజంలో జరిగే విషయాలపై స్పందిస్తూ ఉంటుంది. తాజాగా రష్మీ గౌతమ్ వాలంటైన్ డే దగ్గర పడటంతో తన మనసుకు ఎంతో దగ్గరైన తన పెట్ (కుక్క పిల్ల) తో కలిసి షికారుకు వెళ్లింది. అక్కడ ఆ పెట్ చేసిన అల్లరిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన ప్రియమైన వాడితో ప్రేమికుల రోజును ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి వాలంటైన్ డేను రష్మీ గౌతమ్ తన పెట్‌తో చేసుకోవడం వెరైటీ అని చెప్పుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jabardasth comedy show, Rashmi Gautam, Telugu Cinema, Tollywood, Valentines day