విజయీభవ ఆర్ట్స్ పతాకంపై నందు ఆనంద్ కృష్ణ (Nandu) హీరోగా తెరకెక్కిన కొత్త సినిమా 'బొమ్మ బ్లాక్ బస్టర్' (Bomma Block Buster). ఈ సినిమాలో యాంకర్ రష్మీ (Rashmi Gautam) హీరోయిన్ గా నటించింది. రాజ్ విరాట్ (Raj Virat) దర్శకత్వం వహించిన ఈ సినిమాను పవ్రీణ్ పగడాల, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డీ మడ్డి, మనోహార్ రెడ్డి ఈడా నిర్మించారు. నిజానికి ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని ఇప్పుడు విడుదలకు సిద్ధం చేశారు. నవంబర్ 4న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ చేపడుతున్న యూనిట్.. ఇందులో భాగంగా తాజాగా బొమ్మ బ్లాక్ బస్టర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. 2 నిమిషాల 51 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ వీడియోలో నందు డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ని ఇష్టపడే వ్యక్తిగా నందు, కొట్లాటలంటే ఆసక్తి చూపే అమ్మాయిగా రష్మిని చూపించి సినిమాపై ఆసక్తి పెంచారు. ఇక రష్మీ- నందు నడుమ షూట్ చేసిన రొమాంటిక్ సీన్స్ ఈ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి.
యాంకర్ గా చిన్నితెరపై ఫుల్లుగా వినోదం పంచుతున్న యాంకర్ రష్మీ.. అప్పుడప్పుడూ సినిమాలతో ఓ టచ్ ఇస్తోంది. వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని తన కెరీర్ ఫుట్ స్టెప్ గా తీసుకొని టాలెంట్ బయటపెడుతోంది. ఈ క్రమంలోనే బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా చేసింది రష్మీ గౌతమ్.
కాగా.. ఈ సినిమా ప్రమోషన్స్ విషయమై ఓ వివాదం చెలరేగింది. బొమ్మ బ్లాక్ బస్టర్ ప్రమోషన్స్ కోసం ఎన్నిసార్లు ఫోన్ చేసినా రష్మీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, పైగా మూవీ ప్రమోషన్స్ కు రావడం లేదని నందు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రష్మీ ఫోటోషూట్ జరుగుతున్న ప్లేస్ కు వెళ్లి అక్కడ నానా హంగామా చేశాడు నందు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొట్టింది.
అయితే సినిమా ప్రమోషన్స్ కోసమే రష్మీ, నందు ఇలా ప్రాంక్ వీడియో చేశారని అంతా భావించారు. కానీ అది ప్రాంక్ కాదని చెప్పింది రష్మీ. ఈ సినిమా అసలు విడుదలవుతుందో లేదో అనే పరిస్థితిలో ఉండగా.. సడెన్గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. వాళ్ళిచ్చిన టైమ్లో నేను వేరే షూట్లో ఉన్నా. కానీ వాళ్ళు అస్సలు ఆగకుండా వస్తావా రావా అని హంగామా చేశారని రష్మీ చెప్పింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor rashmi, Tollywood, Tollywood actress