RASHMI GAUTAM BECOMES EMOTIONAL ABOUT BRUNO AND OUTRAGE AGAINST THE KERALA GOVERNMENT SR
Rashmi Gautam : బ్రూనో విషయంలో తీవ్ర ఆవేదనకు గురైన రష్మి గౌతమ్.. మనుషులేనా అలా చేసింది అంటూ..
Rashmi Gautam Photo : Twitter
Rashmi Gautam : రష్మి గౌతమ్ కేరళ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరువనంతపురం బీచ్ లో ముగ్గురు వ్యక్తులు 'బ్రూనో' అనే కుక్కని కర్రలతో చావబాది చంపేశారు. ఆపై చేపల గాలానికి వేలాడదీశారు.
Rashmi Gautam : రష్మి గౌతమ్.. తెలుగు టీవీ తెరపై తన అందచందాలతో పాటు.. చురుకైన వ్యాఖ్యానంతో అదరగొడుతూ వీక్షకుల్నీ కట్టిపడేస్తోన్న అందాల యాంకర్. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాలు చేస్తూ తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ మధ్య రష్మీ హీరోయిన్గా నటించిన 'గుంటూరు టాకీస్' కేవలం రష్మీ పేరు తన అందచందాలతోనే హిట్ అయ్యిందని అంటారు.. ఆమె అభిమానులు. ఓ వైపు టీవీల్లో యాంకరింగ్, మరోవైపు సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం రష్మీ కెరీర్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. అది అలా ఉంటే రష్మీలో మరో కోణం.. సామాజిక అంశాలపై స్పందించడం. మహిళలపై రేపుల విషయంలో కానీ, మూగ జీవాల సంరక్షణలోగాని స్పందిస్తూ.. ట్వీట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని చెబుతూ సామాజిక స్పృహా ఉన్న అందాల యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. ఈ లక్షణం మనం అందరిలో చూడలేము.
ఇక ఇదే విషయంలో తాజాగా ట్విట్టర్ వేదికగా రష్మి మరోసారి స్పందించారు. బ్రూనో అనే ఓ కుక్క విషయంలో భాగంగా కేరళ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వందశాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రంలో ఇలాంటీ చేష్టలు ఏంటనీ ప్రశ్నించారు రష్మి. వివరాల్లోకి వెళితే.. తిరువనంతపురం బీచ్‌లో ముగ్గురు వ్యక్తులు 'బ్రూనో' అనే కుక్కని కట్టేసి క్రికెట్ బ్యాట్‌తో అతి క్రూరంగా కొడుతూ చావబాది చంపేశారు. ఆ కుక్కను ఆపై చేపల గాలానికి వేలాడదీశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ సంఘటన గురించి తెలుసుకున్న రష్మి.. తీవ్ర వేదనకు గురైయారు. 'ఇలాంటి సంఘటనలు చూస్తుంటే మనుషులపైనే సిగ్గుగా అనిపిస్తుంది. బ్రూనో ఏంపాపం చేసింది.. మీకు ఏం అన్యాయం చేసింది అంటూ రష్మీ తీవ్ర అసహనం, ఆవేదన వ్యక్తం చేశారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.