Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: December 26, 2019, 3:00 PM IST
రష్మి గౌతమ్,, సుడిగాలి సుధీర్ (Rashmi Gautam Sudigali Sudheer)
అవును.. నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. సుడిగాలి సుధీర్ అంటే ఇప్పుడు కేవలం యాంకర్, టీం లీడర్ కాదు హీరో కూడా. తాజాగా ఈయన నటించిన సాఫ్ట్వేర్ సుధీర్ సినిమా విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్ 28న విడుదల కానుంది ఈ చిత్రం. కొత్త దర్శకుడు పి రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సుధీర్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు ఈయన. ఈ సినిమాలో నాజర్, ఇంద్రజ లాంటి సీనియర్ యాక్టర్స్ కూడా నటించారు. ఇదిలా ఉంటే సాఫ్ట్వేర్ సుధీర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.

సాఫ్ట్వేర్ సుధీర్ సినిమా పోస్టర్
ఈ కార్యక్రమానికి టీవీ సెలబ్రిటీస్ అంతా వచ్చి సుధీర్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. తనతో స్నేహంగా ఉండేవాళ్ళంతా ఈ ప్రోగ్రామ్‌లో కనిపించారు. తెలుగులో టాప్ యాంకర్స్‌గా ఉన్న రవి, ప్రదీప్, సుమతో పాటు జబర్దస్త్ కమెడియన్స్ రాంప్రసాద్, గెటప్ శ్రీను, రాకెట్ రాఘవ, ముక్కు అవినాష్ ఇలా చాలా మంది జబర్దస్త్ కమెడియన్స్ వచ్చారు. కానీ సుధీర్‌కు అత్యంత కీలకమైన స్నేహితురాలు రష్మీ మాత్రం ఇక్కడ కనిపించలేదు. దాంతో ఫ్యాన్స్ కూడా ఇదే అడిగారు.

సుడిగాలి సుధీర్ (Facebook/Photo)
సుధీర్ అంటే వెంటనే గుర్తొచ్చే రష్మీ మొదట్నుంచీ కూడా పెద్దగా ఈ సినిమా ప్రమోషన్స్‌కు రాలేదు. కావాలనే ఈ సినిమా ప్రమోషన్స్ నుంచి రష్మీ దూరంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక జబర్దస్త్ మాజీ జడ్జి, సుధీర్ గురువు నాగబాబు కూడా ఈ వేడుకలో కనిపించలేదు. సాఫ్ట్వేర్ సుధీర్ ఫస్ట్ లుక్ నుంచి అన్నింటికి నాగబాబు వచ్చాడు. కానీ ఆయన జబర్దస్త్ నుంచి బయటికి వచ్చిన తర్వాత జరిగిన తొలి వేడుకకు మాత్రం నాగబాబు రాలేదు. మొత్తానికి సుధీర్ సినిమా వేడుకలో ఈ ఇద్దరూ లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపించింది.
Published by:
Praveen Kumar Vadla
First published:
December 26, 2019, 3:00 PM IST