Rashmi Gautam-Anchor Pradeep: రష్మీ, ప్రదీప్‌లకు అరుదైన గౌరవం.. 400 మంది స్ఫూర్తివంతుల జాబితాలో చోటు..

రష్మి, ప్రదీప్ (Rashmi and pradeep)

తెలుగు టీవీ యాంకర్స్ ప్రదీప్ మాచిరాజు, రష్మీ గౌతమ్ అరుదైన ఘనతను సాధించారు. వీరు 400 మంది స్ఫూర్తివంతుల జాబితాలో చోటు సంపాదించారు.

  • Share this:
    తెలుగు టీవీ యాంకర్స్ ప్రదీప్ మాచిరాజు, రష్మీ గౌతమ్ అరుదైన ఘనతను సాధించారు. వీరు 400 మంది స్ఫూర్తివంతుల జాబితాలో చోటు సంపాదించారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బ్రిటన్ జర్నలిస్టు కిరణ్ రాయ్ తాజాగా `400 మంది స్ఫూర్తివంతుల` జాబితాను విడుదల చేశారు. ఆ లిస్ట్‌లో జబర్దస్త్ యాంకర్ రష్మి, మరో ప్రముఖ యాంకర్ ప్రదీప్ చోటు సంపాదించారు. ఈ జాబితాలో చోటు సంపాదించడం కోసం భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ దేశాల్లో ఉన్న పలువురు సెలెబ్రీటీలు పోటీ పడ్డారు. ఇక భారతీయ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రహమాన్ ఈ జాబితాలో అగ్ర స్థానంలో నిలిచారు. ఇదే జాబితా బాలీవుడ్ సింగర్స్ సోనూ నిగమ్, అద్నాన్ సమీ వంటి వారు కూడా చోటు దక్కించుకున్నారు. రహమాన్ లాంటీ వారి ప్రముఖులతోపాటు తాము కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం.. చాలా సంతోషాన్ని కలిగించిందని రష్మి, ప్రదీప్ తెలిపారు. దీనికి సంబందించి ఇరువురు తమ సోషల్ మీడియా వేదికగా వీడియోలను విడుదల చేశారు. కిరణ్ రాయ్ స్వయంగా ఇంటర్వ్యూలు చేసి ఎంపిక చేసినట్టు వీరు తెలిపారు. ఇక కిరణ్ రాయ్ పక్రటించిన ఈ జాబితాలో మొత్తం 230 మంది భారతీయ ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫీట్ సాధించడంతో రష్మీ ప్రదీప్ అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. యాంకర్స్ గా చేస్తూ ఇంత మందిని ప్రభావితం చేయడం గొప్ప విషయం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.







    ఇక యాంకర్ రష్మి విషయానికి వస్తే.. ఆమె టీవీల్లో యాంకరింగ్ చేస్తూనే.. తనకు తోచిన విధంగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గోంటు స్పూర్తి నింపుతుంది. ముఖ్యంగా మూగ జీవాల సంరక్షణలో రష్మీ చేసిన సాయం చెప్పుకోదగ్గది. కరోనా లాక్ డౌన్ సమయంలో రష్మీ చేత బకెట్ పట్టుకుని వీధుల్లో తిరుగుతూ కుక్కలకు ఆహారం పంచడం ఎంతో మందికి స్పూర్తినిచ్చింది. అంతేకాదు సామాజిక అంశాల పట్ల, సమాజం పట్ల రష్మీకి అవగాహాన ఎక్కువ. చాలా మంది సినీ సెలెబ్రిటీల్లో ఇది మనకు కనబడదు. రష్మీ ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షో కామెడీ షోతో అంత పాపులర్ అయ్యింది. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ఆ షోకు కావాల్సినంత గ్లామర్ అందిస్తూ అక్కడ కూడా అదరగొడుతోంది. ఇక మరో యాంకర్ ప్రదీప్ కూడా తనకు తోచిన విధంగా సాయం చేస్తుంటాడు. కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రదీప్ కొన్ని కుంటుంబాలను ఆదుకున్నాడు. ఆ కష్టకాలంలో ఆయన వస్తు రూపంలో, డబ్బు రూపంలో ఆదుకుంటూ అవసరమున్న కుటుంబాలకు అండగా నిలిచాడు.
    Published by:Suresh Rachamalla
    First published: