తెలుగు బుల్లితెరపై సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ కంటే రొమాంటిక్ కపుల్ మరోటి ఉండదేమో..? వాళ్లు కనిపిస్తే చాలు టిఆర్పీ రేటింగ్స్ కూడా పరుగులు తీస్తూ వస్తుంటాయి. అందుకే వాళ్లతో ప్రోగ్రామ్స్ చేయడానికి ఛానెల్స్ కూడా పోటీ పడుతుంటాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు సుధీర్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది రష్మి గౌతమ్. ఏడేళ్లుగా ఈ ఇద్దరూ ఒకరికొకరు బాగా తెలుసు. పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుకునేంత సాన్నిహిత్యం ఈ ఇద్దరి మధ్య ఉందంటారు కొందరు వాళ్ల కామన్ ఫ్రెండ్స్.
అయితే వాళ్లు కేవలం స్నేహితులు మాత్రమే అని.. అంతకుమించి యూ ట్యూబ్, సోషల్ మీడియాలో వచ్చినట్లు ఎలాంటి రిలేషన్ లేదని చెప్తుంటారు. ఇప్పుడు కూడా ఈ ఇద్దరూ కలిసి అలీతో సరదాగా షోకు వచ్చారు. అక్కడ సుధీర్ గురించి చాలా విషయాలు చెప్పింది రష్మి. ముఖ్యంగా అతడిలో హ్యుమానిటీ బాగుంటుందని చెప్తూనే.. రొమాంటిక్ కోణం కూడా అదిరిపోతుందని సర్టిఫికేట్ ఇచ్చింది రష్మి గౌతమ్.
ఏంటి చాలా అందంగా కనిపిస్తున్నావ్ అని అలీ అడిగితే.. సుధీర్ చాలా రొమాంటిక్ అబ్బా అంటూ సమాధానమిచ్చింది రష్మి. కనిపించడు కానీ లోపల సుధీర్ చాలా అంటే చాలా రొమాంటిక్.. ఆ యాంగిల్ చాలా మందికి తెలియదంటూ చెప్పుకొచ్చింది ఈ జబర్దస్త్ యాంకర్. రష్మి అలా చెప్పగానే అలీ కూడా సిగ్గు పడ్డాడు. అమ్మో.. నీకు సుధీర్ గురించి చాలా విషయాలు తెలుసుగా అంటూ కళ్లు ఎగరేసాడు. మొత్తానికి ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.