Raashi Khanna: రాశీ ఖన్నా అవకాశాల కోసం ఏం చేసిందంటే..

నిన్నమొన్నటి వరకుసౌత్‌లో  బిజీగా ఉన్న హీరోయిన్లలో రాశీ ఖన్నా ఒకరు. ఉత్తరాది నుంచి వచ్చిన ఈ భామ మొన్నటివరకు దక్షిణాదిన చేతి నిండా అవకాశాలతో బిజీగా ఉంది. ద్వితీయ శ్రేణిలోని హీరోలతో రాశీకి వరసగా అవకాశాలు వచ్చాయి. ఇక హీరోయిన్‌గా అవకాశాల కోసం ఈ భామ ఏం చేసిందో తెలుసా...

news18-telugu
Updated: June 25, 2019, 4:19 PM IST
Raashi Khanna: రాశీ ఖన్నా అవకాశాల కోసం ఏం చేసిందంటే..
రాశిఖన్నా (ఇన్‌స్టాగ్రామ్)
  • Share this:
నిన్నమొన్నటి వరకుసౌత్‌లో  బిజీగా ఉన్న హీరోయిన్లలో రాశీ ఖన్నా ఒకరు. ఉత్తరాది నుంచి వచ్చిన ఈ భామ మొన్నటివరకు దక్షిణాదిన చేతి నిండా అవకాశాలతో బిజీగా ఉంది. ద్వితీయ శ్రేణిలోని హీరోలతో రాశీకి వరసగా అవకాశాలు వచ్చాయి . ఆ మధ్య వరుసగా యువ హీరోలతో  నటించిన ఈ జాణకు ఇప్పుడు తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ తరం హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్‌నే నమ్ముకుంటున్నారని చెప్పక తప్పదు. అలాంటి పాత్రలతోనే స్టార్డమ్ సాధ్యమని వారు గట్టిగా నమ్ముతున్నారు. నటి కీర్తీసురేశ్‌లా కెరీర్ తొలి నాళ్లలో నటనకు అవకాశం ఉన్న పాత్రలు దొరకడం సాధ్యం కాదు. అందుకే గ్లామర్ ను ఆశ్రయించింది రాశిఖన్నా. అందుకు తగ్గట్టు మంచి గ్లామరస్ ఫొటోలను అందం చూడవయా ఆనందించవయా అన్నట్టు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూనే ఉంది. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తెలుగులో ‘ఊహలు గుసగుసలాడె’చిత్రంలో నటించి పేరుతెచ్చుకున్నఈ బ్యూటీ. ఈ మధ్యనే ‘ఇమైకా నొడిగళ్’ చిత్రంతో తమిళసినిమాకు పరిచయం అయింది. తరువాత జయం రవితో జతకట్టిన ‘అడంగుమరు’చిత్రం సక్సెస్‌ అందించింది. దీంతో కోలీవుడ్లోనే రాశీఖన్నా మంచి అవకాశాలే దక్కుతున్నాయి. ఇలా టాలీవుడ్లో నటిగా పేరు తెచ్చుకుని కోలీవుడ్‌లో మకాం పెడుతున్న నటీమణుల లిస్టులో రాశీఖన్నా చేరిపోయింది. దీంతో స్టార్ హీరోలతో నటించాలని ఆశ పడుతున్న ఈ బ్యూటీ అలాంటి అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలో నటిస్తోంది.

First published: June 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు