హోమ్ /వార్తలు /సినిమా /

మెగా హీరోపై రాశీఖన్నా సీరియస్...స్టేజీపై అందరూ చూస్తుండగానే అలా అనేసిందా..?

మెగా హీరోపై రాశీఖన్నా సీరియస్...స్టేజీపై అందరూ చూస్తుండగానే అలా అనేసిందా..?

రాశిఖన్నా (ఇన్‌స్టాగ్రామ్)

రాశిఖన్నా (ఇన్‌స్టాగ్రామ్)

నిజానికి టాలివుడ్‌లో హీరోలను పల్లెత్తు మాట అనేందుకు హీరోయిన్లు సాహసించరు. అందులో మెగా కాంపౌండ్ లోని హీరోల జోలికి అస్సలు పోరు. అలాంటిది రాశీ ఖన్నా అలా ఎలా సాయి ధరమ్ తేజ్ ను స్టేజీ మీదనే నిలదీసిందా అని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...

ప్రతీరోజు పండగే సినిమా ప్రమోషన్స్‌తో దూసుకెళుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంగ్ లాంచ్ కార్యక్రమాల్లో హీరో సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా, డైరక్టర్ మారుతి జోరుగా పాల్గొంటున్నారు. ఇప్పటికే సినిమాలోని సాంగ్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ప్రతిరోజు పండగే సాంగ్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాశీఖన్నా సభను ఉద్దేశించి ప్రసంగం చేసింది. అయితే రాశీఖన్నా స్టేజిపై మాట్లాడుతున్నంత సేపు, వెనుక నిలబడి ఉన్న హీరో సాయి ధరమ్ తేజ్ పగలబడి నవ్వుతూ కనిపించాడు. దీంతో డిస్టర్బ్‌గా ఫీల్ అయిన రాశీ ఖన్నా వెనక్కు తిరిగి ఎందుకు నవ్వుతున్నావో చెప్పు అంటూ నిలదీసింది. అయితే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, బహుశా సినిమాలో నా కేరక్టర్ గుర్తుకువచ్చి నవ్వుకున్నాడో ఏమో అంటూ కవర్ చేసింది.

నిజానికి టాలివుడ్‌లో హీరోలను పల్లెత్తు మాట అనేందుకు హీరోయిన్లు సాహసించరు. అందులో మెగా కాంపౌండ్ లోని హీరోల జోలికి అస్సలు పోరు. అలాంటిది రాశీ ఖన్నా అలా ఎలా సాయి ధరమ్ తేజ్ ను స్టేజీ మీదనే నిలదీసిందా అని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సాయిధరంతేజ్ తన కోస్టార్స్ తో చాలా గౌరవంగా ఉంటాడని, కుటుంబ సభ్యుడిలా కలిసిపోతాడని, అందుకే ఆ చనువుతోనే రాశీ ఖన్నా అలా చేసి ఉంటుందనే పాజిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

First published:

Tags: Rashi khanna, Sai Dharam Tej, Tollywood

ఉత్తమ కథలు