Home /News /movies /

రజినీకాంత్ కోసం అతిలోకసుందరి శ్రీదేవి ఉపవాసం ఉన్న వేళ..

రజినీకాంత్ కోసం అతిలోకసుందరి శ్రీదేవి ఉపవాసం ఉన్న వేళ..

శ్రీదేవి రజినీకాంత్ (sridevi rajinikanth)

శ్రీదేవి రజినీకాంత్ (sridevi rajinikanth)

Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్‌కి ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి. ప్రపంచంలోని అన్ని మూలల నుంచి కూడా ఆయనకు అభిమానులున్నారు.

సూపర్ స్టార్ రజనీకాంత్‌కి ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి. ప్రపంచంలోని అన్ని మూలల నుంచి కూడా ఆయనకు అభిమానులున్నారు. ఇండియాతో పాటు బయటి దేశాల్లో కూడా రజినీ అంటే పడి చచ్చిపోతుంటారు ఫ్యాన్స్. మలేషియా, జపాన్ లాంటి దేశాల్లో కూడా రజినీకాంత్ ఫాలోయింగ్ భీభత్సంగా ఉంది. ఆయనకు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే భయపడుతుంటారు అభిమానులు. ఆరోగ్యం విషయంలో కూడా అంత ఆసక్తిగా ఉంటారు ఫ్యాన్స్.
రజినీకాంత్ (Rajinikanth)
రజినీకాంత్ (Rajinikanth)

ఎప్పుడైనా రజినీకి చిన్న అనారోగ్యం వచ్చిందని తెలిస్తే వెంటనే హైరానా పడిపోతుంటారు అభిమానులు. అలాంటి ప్రాణమిచ్చే అభిమానులు ఆయనకు చాలా మంది ఉన్నారు. అందుకే చీమ కుట్టినా కూడా ఫ్యాన్స్ కంగారు పడుతుంటారు. ఆయనకు కేవలం బయట మాత్రమే కాదు ఇండస్ట్రీలో కూడా అలాంటి ఫ్యాన్స్ ఉన్నారు. కొందరు సెలబ్రిటీస్ కూడా రజినీ అంటే ప్రాణమిస్తుంటారు. అలాంటి వాళ్లలో అతిలోకసుందరి శ్రీదేవి కూడా ఉన్నారు. ఈ దివంగత నటికి రజినీకాంత్ అంటే ప్రాణం.
శ్రీదేవి (sridevi)
శ్రీదేవి (sridevi)

ఆయనతో చాలా సినిమాలు చేసింది కూడా ఈమె. 2011లో రజినీకాంత్ తీవ్ర అస్వత్తతకు లోనయ్యారు. ఆయనకు ఉన్నట్లుండి చాలా సీరియస్ అయింది కూడా. అప్పట్లో ఆయన చేసిన రోబో సినిమానే చివరిది అంటూ ప్రచారం కూడా జరిగింది. ఆయన కూడా వరసగా విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకోవడంతో అభిమానులు కూడా కంగారు పడుతుండే వాళ్లు.
శ్రీదేవి రజినీకాంత్ (sridevi rajinikanth)
శ్రీదేవి రజినీకాంత్ (sridevi rajinikanth)

అలాంటి సమయంలో రజనీకాంత్ కోలుకోవాలని వారం రోజుల పాటు శ్రీదేవి ఉపవాస దీక్ష చేసిందని ఇప్పుడు తెలిసింది. ఆగస్ట్ 14న శ్రీదేవి 56వ జయంతి సందర్భంగా ఈ విషయం బయటికి వచ్చింది. మొత్తానికి రజినీకాంత్ కోసం శ్రీదేవి ఉపవాసం చేయడం అనేది నిజంగానే ఆసక్తికరంగా ఉంది కదా.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Rajinikanth, Sridevi, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు