స్టార్ హీరో కొడుకుపై రేప్ కేసు.. నమ్మించి లోబరుచుకున్నాడని యువతి ఫిర్యాదు..

బాలీవుడ్‌లో ఎప్పుడూ ఏదో ఓ సంచలన వార్త బయటికి వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా కొందరు హీరోల తనయులు వాళ్ల బ్యాగ్రౌండ్ చూసుకుని అమ్మాయిలను మోసం చేస్తున్నారని.. వాళ్లను శారీరకంగా వాడుకుని వదిలేస్తున్నారంటూ..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 17, 2020, 10:35 PM IST
స్టార్ హీరో కొడుకుపై రేప్ కేసు.. నమ్మించి లోబరుచుకున్నాడని యువతి ఫిర్యాదు..
మిథున్ చక్రవర్తి కొడుకు మహాక్షయ్ (mithun chakraborty son mahakshy)
  • Share this:
బాలీవుడ్‌లో ఎప్పుడూ ఏదో ఓ సంచలన వార్త బయటికి వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా కొందరు హీరోల తనయులు వాళ్ల బ్యాగ్రౌండ్ చూసుకుని అమ్మాయిలను మోసం చేస్తున్నారని.. వాళ్లను శారీరకంగా వాడుకుని వదిలేస్తున్నారంటూ ఎప్పటికప్పుడు వార్తలు బయటికి వస్తూనే ఉన్నాయి. కంగన రనౌత్ కూడా దీనిపై నోరు విప్పింది. బాలీవుడ్‌లో ఓ వర్గం కేవలం అవకాశాల కోసం వచ్చే అమ్మాయిల నుంచి పడకసుఖం పొందడానికి మాత్రమే ఉంటారని ఆమె అప్పట్లో సంచలన కామెంట్స్ చేసింది. ఇదిలా ఉంటే ఉత్తరాదిన కొందరు హీరోలు, సీనియర్ నటుల తనయులపై ఇలాంటి ఫిర్యాదులు కూడా వస్తూనే ఉంటాయి. ఆ మధ్య జియా ఖాన్ చనిపోయినపుడు కూడా సూరజ్ పంచోలీ పేరు ఎక్కువగా వినిపించింది. మొన్నటికి మొన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మనేజర్ దిశ చనిపోయినపుడు కూడా అతడి పేరు బయటికి వచ్చింది. ఇప్పుడు మరో హీరో తనయుడి పేరు కూడా ఇలాంటి కేసులోనే బయటికి వచ్చింది.
మిథున్ చక్రవర్తి కొడుకు మహాక్షయ్ (mithun chakraborty son mahakshy)
మిథున్ చక్రవర్తి కొడుకు మహాక్షయ్ (mithun chakraborty son mahakshy)


ఒకప్పుడు బాలీవుడ్‌లో సంచలన సినిమాలు చేసి స్టార్ హీరోగా వెలిగిపోయిన మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ చక్రవర్తిపై రేప్ కేసు నమోదైంది. గతంలో కూడా మహాక్షయపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. కొందరు అప్ కమింగ్ హీరోయిన్లు పోలీసుల వరకు వచ్చారు.. ఈయనపై ఫిర్యాదు చేసారు. రెండేళ్ల క్రితం భోజ్‌పురి నటిని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి రేప్ చేశాడని.. అబార్షన్ కూడా చేయించాడని మహాక్షయపై ఆరోపణలు వచ్చాయి. తాజా మరో యువతి అతడిపై ఫిర్యాదు చేసింది. తాజాగా ముంబై యువతి ఒకరు పోలీసులకు మహాక్షయపై ఫిర్యాదు చేసింది.
మిథున్ చక్రవర్తి కొడుకు మహాక్షయ్ (mithun chakraborty son mahakshy)
మిథున్ చక్రవర్తి కొడుకు మహాక్షయ్ (mithun chakraborty son mahakshy)

తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని.. చివరకు మోసం చేశాడని మహాక్షయపై ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మహాక్షయ తనతో నాలుగేళ్ల పాటు సహజీవనం చేశాడని.. అనంతరం పెళ్లి మాట ఎత్తితే తనను మానసికంగా శారీరకంగా అనేక ఇబ్బందులకు గురి చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. తాను మహాక్షయ కారణంగా గర్భం దాల్చడంతో బలవంతంగా తనకు అబార్షన్ చేయించారని.. కేసు పెడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని మహాక్షయ తల్లి, మిథున్ భార్య యోగితా బాలి కూడా తనను బెదిరించారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం ఈ కేసు బాలీవుడ్‌లో సంచలనంగా మారుతుంది.
Published by: Praveen Kumar Vadla
First published: October 17, 2020, 10:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading