Rao Gopal Rao Death Anniversary : విలనీజంకు కొత్త రూపు తెచ్చిన రావు గోపాల్ రావు యాదిలో..

Rao Gopal Rao Death Anniversary : ప్రముఖ తెలుగు నటుడు రావు గోపాలరావు వర్ధంతి నేడు. ఆయన 1994, ఆగష్టు 13 న దివంగతులయ్యారు.

news18-telugu
Updated: August 13, 2020, 11:11 AM IST
Rao Gopal Rao Death Anniversary : విలనీజంకు కొత్త రూపు తెచ్చిన రావు గోపాల్ రావు యాదిలో..
రావు గోపాల్ రావు ఫైల్ ఫోటో Photo : facebook
  • Share this:
ప్రముఖ తెలుగు నటుడు రావు గోపాలరావు వర్ధంతి నేడు. ఆయన 1994, ఆగష్టు 13 న దివంగతులయ్యారు. విలన్‌గా, కామెడీ విలన్‌గా, కేరక్టర్‌ ఆర్టిస్టుగా రాణించిన రావు గోపాలరావు కాకినాడ సమీపంలోని గంగనపల్లిలో జనవరి 14, 1937 లో జన్మించారు. ఈరోజు వర్ధంతి సందర్భంగా ఆయన నట జీవితం గురించి మాట్లాడుకుందాం.. రావు గోపాలరావు సినీ జీవితం ముత్యాల ముగ్గు చిత్రంలోని కొంపలు కూల్చే కాంట్రాక్టర్ వేషంతో గొప్ప మలుపు తిరిగిందనే చెప్పోచ్చు. ఆరోజుల్లో ఆ సినిమాలో ఆయన చెప్పిన డైలాగులు మారుమోగిపోయాయి. ఆయన డైలాగుల్నీ ఆడియో క్యాసెట్స్ రూపంలో అమ్మారు. అంతలా ఆకట్టుకున్నాయి ఆయన డైలాగ్స్. ఇక ఆ సినిమా తరువాత నుంచి తెలుగు సినిమాలో విలనీజం కొత్త ట్రెండ్ సృష్టించింది. కొత్త విలనీజానికి రావుగోపాలరావు కొత్త రూపునిచ్చారు. ఇక ఆ సినిమా తర్వాత ఆయన నటించిన వేటగాడు సినిమాలో కూడా రావుగోపాలరావు తన డైలాడ్ మాడ్యూలేషన్‌తో తెలుగు వారి హృదయాల్ని మరోసారి దోచుకున్నాడు. ఇక మావూళ్ళో మహాశివుడు, స్టేషన్ మాస్టర్, వింత దొంగలు, మనవూరి పాండవులు, ఈనాడు వంటి చిత్రాలలో నటించి ఆయన తన నట విశ్వరూపాన్ని చూపించాడు. రావు గోపాల్ రావు చెప్పిన డైలాగ్స్‌లలో అత్యంత ప్రాచుర్యం పొందిన డైలాగ్..

సెగట్రీ! సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ!ఆకాసంలో ఎదో మర్డరు జరిగినట్టు లేదూ.... ఎప్పుడూ యదవ బిగినెస్సేనా. మడిసన్నాక కుసంత కలాపోసనుండాల. తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏముంటది?

ఇక రావు గోపాలరావు ఓ వైపు నటిస్తూనే పార్లమెంటు సభ్యునిగా ఆరేళ్ళపాటు కొనసాగారు. సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలకు 1990 సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఇక రావు గోపాల్ రావు నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన ఆయన కుమారుని పేరు రావు రమేష్ తెలిసిందే. రావు రమేష్ కూడా మంచి నటుడుగానే కాకుండా తండ్రి లాగే ఆకట్టుకునే డైలాగ్ మాడ్యూలేషన్స్‌తో అదరగొడుతున్నాడు.
Published by: Suresh Rachamalla
First published: August 13, 2020, 11:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading