news18-telugu
Updated: January 4, 2019, 12:24 PM IST
‘గల్లీ బాయ్’లో రణ్వీర్ సింగ్, ఆలియా భట్
రీసెంట్గా దీపికా పదుకొణేను పెళ్లి చేసుకొని ఒకింటి వాడైన రణ్వీర్ సింగ్...తాజాగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో చేసిన ‘సింబా’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ.వంద కోట్లను రాబట్టింది. అంతేకాదు ఓవర్సీస్లో రూ.40 కోట్లను కలెక్ట్ చేసింది. అంతేకాదు ఒక్క ఆస్ట్రేలియాలలోనే వన్ మిలియన్ డాలర్ కలెక్ట్ చేసింది.
‘పద్మావత్’, ‘సంజు’, ‘2.O’ సినిమాల తర్వాత ఈ ఘనత అందుకున్న సినిమాగా ‘సింబా’ రికార్డులకు కెక్కింది. మొత్తంగా ఈ చిత్రం త్వరలో రూ.200 కోట్ల క్లబ్బులో ప్రవేశించనుంది.

‘సింబా’లో రణ్వీర్ సింగ్
‘సింబా’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లున్న రణ్వీర్ సింగ్ త్వరలో జోయా అక్తర్ దర్శకత్వంలో ‘గల్లీ బాయ్’ సినిమాతో పలకరించనున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

‘గల్లీబాయ్’గా రణ్వీర్ సింగ్
తాజాగా ‘గల్లీబాయ్’ సినిమా నుంచి ఒక పాటను రిలీజ్ చేసారు. ఈ సాంగ్‌లో ముంబాయి మురికవాడలో ‘గల్లీబాయ్’గా అల్లరి చిల్లరిగా తిరిగే హీరో..ఎలా పాటలు పాడుతూ రాక్‌స్టార్‌గా మారాడనేదే ఈ సినిమా స్టోరీలా కనబడుతోంది.
అంతేకాదు ఈ పాట చివర్లో ‘గల్లీ బాయ్’ ట్రైలర్‌ను ఈ నెల 9న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ‘గల్లీబాయ్’లో రణ్వీర్ సింగ్ సరసన ఆలియా భట్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమాతో రణ్వీర్ సింగ్..తన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేస్తాడా లేదా అనేది చూడాలి.
పైసావసూల్ బ్యూటీ ముస్కాన్ సేథీ హాట్ ఫోటోషూట్
ఇవి కూడా చదవండి
అర్జున్ రెడ్డి డైరెక్టర్‌తో జూనియర్ ఎన్టీఆర్ సినిమా
మహేష్ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వనున్న బాలీవుడ్ భామ
సంక్రాంతి సినిమాల్లో రజినీకాంత్ ‘పేట’కు స్యాండ్ విజ్ మసాజ్ తప్పదా..?
First published:
January 4, 2019, 12:18 PM IST