కపిల్ దేవ్‌గా మారిన రణ్‌వీర్ సింగ్.. కేక పుట్టిస్తోన్న 83 బయోపిక్ ఫస్ట్ లుక్..

ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. అందుడుస్తోంది. అందులో స్పోర్ట్స్ స్టార్స్ మీద తెరకెక్కిన సినిమాలు బాలీవుడ్‌లో నయా హిస్టరీని క్రియేట్ చేసాయి. ఇపుడు 1983లో భారతదేశానికి క్రికెట్‌లో తొలి ప్రపంచ కప్‌ను తీసుకొచ్చిన ఆల్‌రౌండర్ కెప్టెన్ కపిల్ దేవ్ జీవితంపై ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ ‘83’ ది ఫిల్మ్ అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ రోజు హీరో రణ్‌వీర్ సింగ్ బర్త్ డే సందర్భంగా ‘83’ బయోపిక్‌లో రణ్‌వీర్ సింగ్ పాత్రకు సంబంధించిన లుక్‌ను రిలీజ్ చేసారు.

news18-telugu
Updated: July 6, 2019, 1:16 PM IST
కపిల్ దేవ్‌గా మారిన రణ్‌వీర్ సింగ్.. కేక పుట్టిస్తోన్న 83 బయోపిక్ ఫస్ట్ లుక్..
రణ్‌వీర్ సింగ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. అందులో స్పోర్ట్స్ స్టార్స్ మీద తెరకెక్కిన సినిమాలు బాలీవుడ్‌లో నయా హిస్టరీని క్రియేట్ చేసాయి. ఈ రూట్‌లోనే తెరకెక్కిన ‘మేరికామ్’, ‘భాగ్ మిల్కా భాగ్’, ‘పాన్ సింగ్ తోమర్’ వంటి సినిమాలు బాలీవుడ్‌లో మంచి సక్సెస్ సాధించాయి. ఆ తర్వాత బీటౌన్ ఫిల్మ్ మేకర్స్ క్రికెటర్స్ జీవితాలపై సినిమాలు తీయడం ప్రారంభించారు. ముందుగా భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ జీవితంపై ‘అజ్హర్’ మూవీని తెరకెక్కించారు. ఈమూవీ అనుకున్నంత రేంజ్‌లో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత తాజా మాజీ కెప్టెన్ ఎమ్.ఎస్.ధోని లైఫ్‌పై తెరకెక్కించిన ‘ఎమ్.ఎస్.ధోని..అన్‌టోల్డ్ కహాని’ బాలీవుడ్‌లో మంచి విజయాన్నే అందుకుంది.  ఆ తర్వాత మనదేశంలో ఆటగాడిగా తొలి భారతరత్నం అందుకున్న భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సచిన్’ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. డాక్యుమెంటరీ తరహాలో కమర్షియల్‌గా విజయాన్ని మాత్రం నమోదు చేయలేదు.  ఇపుడు 1983లో భారతదేశానికి క్రికెట్‌లో తొలి ప్రపంచ కప్‌ను తీసుకొచ్చిన ఆల్‌రౌండర్ కెప్టెన్ కపిల్ దేవ్ జీవితంపై ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ ‘83’ ది ఫిల్మ్ అనే మూవీని తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన భార్య రోమి భాటియా పాత్రలో దీపికా పదుకొణే నటిస్తుండంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ రోజు హీరో రణ్‌వీర్ సింగ్ బర్త్ డే సందర్భంగా ‘83’ బయోపిక్‌లో రణ్‌వీర్ సింగ్ పాత్రకు సంబంధించిన లుక్‌ను రిలీజ్ చేసారు. ఈ లుక్‌లో రణ్‌వీర్‌ అచ్చం కపిల్‌దేవ్‌లా ఉన్నాడు. అంతలా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడా అనే రీతిలో ఉన్నాడు. ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో జీవా .. క్రికెటర్ కృష్ణమచారి శ్రీకాంత్ పాత్రలో నటిస్తున్నాడు. నవాజుద్దీన్ సిద్దిఖీ.. రణ్‌వీర్ సింగ్ కోచ్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రలో పంకజ్ త్రిపాఠి, తాహిర్ ఆజ్ భాసిన్,సకీబ్ సలీమ్,చిరాగ్ పటేల్,ఆదినాధ్ కొటారే, తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను మధు మంతెన, విష్ణు ఇందూరి,ఖాన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని వచ్చే యేడాది ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నారు. మరి వెండితెరపై 83 బయోపిక్ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలిక.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 6, 2019, 11:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading