Home /News /movies /

83 Trailer review: ‘83’ ట్రైలర్ విడుదల.. గెలవడానికే మేం ఇక్కడికి వచ్చాం.. గెలిచి చూపిస్తాం..

83 Trailer review: ‘83’ ట్రైలర్ విడుదల.. గెలవడానికే మేం ఇక్కడికి వచ్చాం.. గెలిచి చూపిస్తాం..

83 సినిమా ట్రైలర్ (83 trailer)

83 సినిమా ట్రైలర్ (83 trailer)

83 Trailer review: భారత దిగ్గజ క్రికెటర్స్‌లో ఒకరైన మాజీ సారథి కపిల్ దేవ్ (Kapil Dev) దాదాపు 38 ఏళ్ళ కింద అందించిన మధురమైన విజయం 1983 వరల్డ్ కప్. దాన్ని ఇతివృత్తంగా తీసుకుని బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ చేస్తున్న సినిమా 83. తాజాగా ఈ సినిమా ట్రైలర్ (83 Trailer review) విడుదలైంది.

ఇంకా చదవండి ...
ఇండియాలో క్రికెట్ అనేది కేవలం ఆట కాదు.. ఎమోషన్.. ఇంకా చెప్పాలంటే ఓ మతం. 130 కోట్ల మందిలో దాదాపు 70 శాతం మంది క్రికెట్ చూస్తారంటూ సర్వేలు కూడా చెప్తున్నాయి. అంటే మన దేశంలో క్రికెట్ అనేది ఎంత పెద్ద క్రీడో అర్థమవుతుంది. అందుకే క్రికెట్ అన్నా.. ఆ నేపథ్యంలో వచ్చే సినిమాలన్నా ప్రేక్షకులు చాలా ఇష్టపడుతుంటారు. ఇక వాస్తవిక సంఘటనలను తీసుకుని సినిమాలుగా చేస్తే.. వాటికి ఆదరణ మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఈ నేపథ్యంలో ఎమ్మెస్ ధోనీ లాంటి బయోపిక్స్ వచ్చి బాక్సాఫీస్ దగ్గర వందల కోట్ల వసూళ్ళు సాధించాయి. ఇప్పుడు మరో సంచలన సినిమా కూడా రాబోతుంది.. అదే 83. భారత దిగ్గజ క్రికెటర్స్‌లో ఒకరైన మాజీ సారథి కపిల్ దేవ్ దాదాపు 38 ఏళ్ళ కింద అందించిన మధురమైన విజయం 1983 వరల్డ్ కప్. దాన్ని ఇతివృత్తంగా తీసుకుని బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ చేస్తున్న సినిమా 83. ఇప్పటికే టీమిండియా మాజీ సారథులు ఎంఎస్ ధోని, సచిన్, అజారుద్దీన్ జీవిత చరిత్రలపై బయోపిక్స్ వచ్చాయి. అందులో ధోనీ బయోపిక్ సంచలన విజయం సాధించింది.

ఇప్పుడు కపిల్ దేవ్ జీవిత చరిత్రపై కూడా 83 సినిమా వస్తుంది. ఈ పాత్రలో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్నాడు. కబీర్ ఖాన్ దర్శకుడు కావడంతో అంచనాలు కూడా తారాస్థాయిలోనే ఉన్నాయి. డిసెంబర్ 24న ఈ పాన్ ఇండియన్ సినిమా విడుదల కానుంది. తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల చేసింది. ఇది చూసిన తర్వాత ప్రతీ భారతీయుడికి కళ్లలో నీళ్ళు తిరగడం ఖాయం. గూస్ బంప్స్ తెప్పించే విధంగా ట్రైలర్ ఉంది. 83 ట్రైలర్ చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్స్ వస్తున్నాయి. ఏ మాత్రం అంచనాలు లేకుండా.. ఒక్క మ్యాచ్ అయినా గెలిస్తే చాలు అనుకునేలా ఇండియా నుంచి ఇంగ్లండ్ వెళ్లి.. అక్కడ ఏకంగా వెస్టిండీస్ లాంటి దిగ్గజ టీమ్‌ను ఓడించి కప్ గెలిచారు ఇండియా.


ఆ స్పూర్థిదాయకమైన ప్రయాణాన్ని ఎంతో ఎమోషనల్‌గా చూపిస్తున్నాడు దర్శకుడు కబీర్ ఖాన్. అప్పట్లో మీడియా కూడా టీమిండియాను ఎంతగా హేళణ చేసిందనే విషయాన్ని కూడా చూపించాడు. 23 ఏళ్ళ కపిల్ దేవ్ టీమిండియాని తన భుజాలపై ఎలా నడిపించాడు అనే అంశాలని దర్శకుడు కబీర్ ఖాన్ ఆసక్తికరంగా చూపిస్తున్నాడని ట్రైలర్ చూస్తుంటనే అర్థమవుతుంది. గెలిస్తేనే ఉంటారు.. లేదంటే ఇంటి ముఖం తప్పదు అన్న అత్యంత కీలకమైన జింబాబ్యే మ్యాచ్‌లో 17/5 సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన కపిల్ దేవ్.. 175 పరుగులు కొట్టే ఇన్నింగ్స్ ట్రైలర్‌లో హైలైట్ చేసారు.


అదే సమయంలో త్వరత్వరగా నాలుగు వికెట్లు కోల్పోవడం.. బాత్ రూమ్‌లో ఉన్న కపిల్ దేవ్ ఆ సంగతిని నమ్మకపోవడం లాంటి సన్నివేశాలని దర్శకుడు ఫన్నీగా చూపించాడు. అలాగే ఇంగ్లీష్ రాక పడ్డ ఇబ్బందులను సైతం సరదాగా చూపించాడు కబీర్ ఖాన్. ఇక ట్రైలర్‌లో రణవీర్ సింగ్ మీడియాతో ' ముందే చెప్పాము కదా గెలవడానికే మేమిక్కడ ఉన్నాం అని' అనే డైలాగ్ నిజంగానే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. కచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పునర్వైభవం తీసుకురావడం ఖాయంగా కనిపిస్తుంది. అన్నట్లు ఈ సినిమాలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుంది. తమిళ హీరో జీవా.. ఒకప్పటి ఇండియన్ డ్యాషింగ్ ఓపెనర్ శ్రీకాంత్ పాత్రలో నటిస్తున్నాడు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: 83 Biopic, Hindi Cinema, Kapil Dev, Ranveer Singh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు