కపిల్ దేవ్ భార్య రోమి దేవ్ పాత్రలో అదిరిపోయిన దీపికా పదుకొణే లుక్..

రణ్‌వీర్, దీపిక (Ranveer singh Deepika)

బాలీవుడ్ హాట్ జంట రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణేల గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి తర్వాత వీళ్లిద్దరు 83 బయోపిక్‌లో కలిసి నటించారు. తాజాగా ఈ బయోపిక్‌లో కపిల్ దేవ్ భార్య రోమి భాటియా పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేసారు చిత్ర యూనిట్.

  • Share this:
    బాలీవుడ్ హాట్ జంట రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణేల గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘రామ్ లీలా’, ‘బాజీ రావ్ మస్తానీ’ వంటి సినిమాలతో వెండితెరపై తమ అద్భుతమైన నటనతో కెమిస్ట్రీ పండించారు. మరోవైపు ‘పద్మావత్’ సినిమాలో వీళ్లిద్దరు నటించినా జంటగా మాత్రం నటించలేదు. అంతేకాదు ఈ సినిమాలో వీళ్లిద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు కూాడా లేవు. ఆ తర్వాత వీళ్లిద్దరు  నిజ జీవితంలో పెళ్లితో ఒకింటి వాళ్లైయ్యారు. పెళ్లి తర్వాత ఎవరికి వాళ్లు సినిమాలతో బిజీగా ఉన్న వీళ్లిద్దరు ఇపుడు 1983 భారత్  క్రికెట్‌లో ప్రపంచ కప్ గెలిచిన నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘83’ బయోపిక్‌లో జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్  కపిల్ దేవ్ పాత్రలో నటిస్తుండగా..ఆయన భార్య రోమి భాటియా (రోమి దేవ్) పాత్రలో దీపికా పదుకొణే యాక్ట్ చేస్తోంది. పెళ్లి తర్వాత రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణే ఈ సినిమాలోనే జంటగా నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. క్రికెట్ కోసం జీవితాన్ని అంకితం చేసిన కపిల్‌ దేవ్ వ్యక్తిగత జీవితంలో అండగా నిలిచిన ఆయన విజయంలో తన వంతు సాయం చేసిన రోమి దేవ్  పాత్రకు మంచి స్కోప్ ఉంది. అందుకే ఈ సినిమాలో ఆ పాత్ర కోసం దీపికాను సెలెక్ట్ చేసున్నారు.


    తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన లుక్‌ను అఫీషియల్‌గా రిలీజ్  చేసారు.ఈ చిత్రంలో భార్యాభర్తలైన కపిల్ దేవ్, రోమి దేవ్ మధ్య అనుబంధం హైలెట్ అని చెబుతున్నారు. ఇప్పటి వరకు వీళ్లిద్దరు కలిసి నటించిన ప్రతి సినిమాలో వీళ్లద్దరు చనిపోయే పాత్రల్లోనే నటించారు. కానీ ఫస్ట్ టైమ్ పెళ్లి తర్వాత సుఖాంతం అయ్యే కథలో నటించడం విశేషం. కబీర్ ఖాన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని విష్ణు వర్ధన్ ఇందూరి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, ఫాంటమ్ ఫిల్మ్స్‌తో పాటు పలు నిర్మాణ సంస్థలు భాగస్వాములుగా ఉన్నారు. ఈ చిత్రాన్ని ఎండాకాలంలో ఏప్రిల్ 10న విడుదల చేయనున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: