హీరోయిన్ పాటకు టవల్ చుట్టి స్టెప్పులేసిన టాప్ హీరో... వీడియో వైరల్

మూడేళ్ల క్రితం చేసిన ఓ బాత్‌రూమ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

news18-telugu
Updated: November 24, 2019, 12:09 PM IST
హీరోయిన్ పాటకు టవల్ చుట్టి స్టెప్పులేసిన టాప్ హీరో... వీడియో వైరల్
బాత్‌రూంలో రణ్‌వీర్ స్టెప్పులు
  • Share this:
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్.... తక్కువ సమయంలోనే టాప్ హీరో లెవల్‌కి ఎదిగిపోయాడు. ఇక బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణెను పెళ్లాడి హ్యాపీగా ఓ ఇంటివాడు కూడా అయిపోయాడు. అయితే రణ్‌వీర్ మూడేళ్ల క్రితం చేసిన ఓ బాత్‌రూమ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో షారుఖ్ కాజోల్ సూపర్ హిట్ మూవీ దిల్ వాలే దుల్హనియా లేజాయింగే నుంచి ఓ పాటకు బాత్‌రూమ్‌లో స్టెప్పులేస్తూ రణ్‌వీర్ కనిపిస్తాడు. మేరీ ఖాబోమే జో ఆయే అంటూ... కాజోల్ టవల్ చుట్టుకొని తీసిన ఈ పాట అప్పట్లో ఆడియన్స్ అందర్నీ ఓ ఊపు ఊపింది. తాజాగా రణ్‌వీర్ కూడా ఆ పాటకు లిప్ మూమెంట్ ఇస్తూ టవల్ కట్టి స్టెప్పులేశాడు. ఆ తర్వాత అదే పాట స్టైల్లో బేఫికరే సినిమా డైరెక్టర్‌ ఆదిత్య చోప్రాను టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటూ ప్రశ్నించాడు. అయితే ఇదంతా మూడేళ్లక్రితం జరిగింది. కానీ నెటిజన్స్ ఈ వీడియోను ఏ తవ్వకాల నుంచి బయటకు తీశారో కానీ.. ఇప్పుడు ఈ వీడియో వైలర్ అయ్యింది. ఈ పాటలో ఎవరి ఫెర్‌ఫామెన్స్ బాగుంది ? కాజోల్‌దా? లేక రణ్‌వీర్‌దా అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

Published by: Sulthana Begum Shaik
First published: November 24, 2019, 12:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading