రణ్‌వీర్‌తో గుంజీలు తీయించిన అక్షయ్ కుమార్.. వైరల్ అవుతున్న వీడియో..

అక్షయ్ కుమార్,రణ్‌వీర్ సింగ్ (Instagram/Photo)

ప్రస్తుతం అక్షయ్ కుమార్.. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ‘సూర్యవంశీ’ సినిమా చేసాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీటైన ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదలైంది.ఈ చిత్రం ట్రైలర్ లాంఛ్ ప్రోగ్రామ్‌కు రణ్‌వీర్ ఆలస్యంగా రావడంతో అక్షయ్ కుమార్.. అతనితో గుంజీలు తీయించాడు.

  • Share this:
    ప్రస్తుతం అక్షయ్ కుమార్.. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ‘సూర్యవంశీ’ సినిమా చేసాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీటైన ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదలైంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ మరోసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. అంతేకాదు ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్, రణ్‌వీర్ సింగ్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఈ నిన్న ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమానికి రణ్‌వీర్ సింగ్ 40 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు. దీంతో అక్షయ్ కుమార్.. రణ్‌వీర్ ఆలస్యంగా వచ్చినందుకు క్రమశిక్షణ లేదంటూ.. సరదగా అతనితో గుంజీలు తీయించాడు. అక్షయ్.. రణ్‌వీర్ సింగ్‌తో సరదగా గుంజీతలు తీయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అక్కీ.. 40 నిమిషిలు ఆలస్యంగా వచ్చినందుకు శిక్షగా గుంజీలు తీయాల్సిందే అని చెప్పాడు. దానికి అజయ్ దేవ్‌గణ్.. పోనిలే పాపం క్షమించు.. తన భార్య ఇంట్లో ఉంది కనుక అందుకే ఆలస్యమైనట్టు ఉంది అంటూ వ్యాఖ్యానించాడు. దానికి రణ్‌వీర్ నా భార్య దీపికా.. ఇంట్లోనే ఉంది. కానీ టైమ్ విషయంలో ఖచ్చితంగా ఉంటుంది అంటూ ఫన్ని కామెంట్ చేసాడు.    సూర్యవంశీ సినిమా విషయానికొస్తే.. దర్శకుడు రోహిత్ శెట్టి ఈ చిత్రాన్ని ముంబాయి‌లో ఇప్పటి వరకు జరిగిన బాంబ్ బ్లాస్ట్స్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించింది. అంతేకాదు ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్, రణ్‌వీర్ సింగ్ ముఖ్యపాత్రల్లో నటించారు. అజయ్ దేవ్‌గణ్ సింగం పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తే.. రణ్‌వీర్ సింగ్ ‘సింబా’ గా అలరించనున్నాడు. మరోవైపు ముంబాయి బాంబ్ బ్లాస్ట్‌ల వెనక ఉన్ మాస్టర్ మైండ్ దావూద్ ఇబ్రహీం పాత్రలో జాకీ ష్రాఫ్ నటించాడు. పోలీస్ ఆఫీసర్ నేపథ్యంలో పూర్తి యాక్షన్ ఎంటర్టేనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు రోహిత్ శెట్టి. చాలా రోజుల తర్వాత అక్షయ్ కుమార్.. పూర్తి స్థాయి యాక్షన్ హీరోగా ఈ చిత్రంలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయనున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: