Gully Boy Trailer Talk: గల్లీ బాయ్ ట్రైలర్ టాక్..రాక్‌స్టార్‌గా రణ్‌వీర్ కొత్త అవతారం

Gully Boy Trailer Talk:రీసెంట్‌గా రోహిత్ శెట్టి దర్శకత్వంలో చేసిన ‘సింబా’తో మంచి విజయాన్ని  అందుకున్నాడు రణ్‌వీర్ సింగ్. ఈ సినిమా ఇప్పటి వరకు రూ.200కోట్లను రాబట్టి ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్‌గా రన్ అవుతోంది.‘సింబా’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లున్న రణ్‌వీర్ సింగ్ త్వరలో జోయా అక్తర్ దర్శకత్వంలో ‘గల్లీ బాయ్’ సినిమాతో పలకరించనున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

news18-telugu
Updated: January 9, 2019, 4:13 PM IST
Gully Boy Trailer Talk: గల్లీ బాయ్ ట్రైలర్ టాక్..రాక్‌స్టార్‌గా రణ్‌వీర్ కొత్త అవతారం
‘గల్లీ బాయ్’లో రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్
  • Share this:
రీసెంట్‌గా రోహిత్ శెట్టి దర్శకత్వంలో చేసిన ‘సింబా’తో మంచి విజయాన్ని  అందుకున్నాడు రణ్‌వీర్ సింగ్. ఈ సినిమా ఇప్పటి వరకు రూ.200కోట్లను రాబట్టి ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్‌గా రన్ అవుతోంది.

‘పద్మావత్’, ‘సంజు’ సినిమాల తర్వాత ఈ ఘనత అందుకున్న సినిమాగా ‘సింబా’ రికార్డులకు కెక్కింది. అంతేకాదు దీపికా లేకుండా రణ్‌వీర్ సింగ్‌గా సోలోగా ఈ సక్సెస్ అందుకున్నాడు.

‘సింబా’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లున్న రణ్‌వీర్ సింగ్ త్వరలో జోయా అక్తర్ దర్శకత్వంలో ‘గల్లీ బాయ్’ సినిమాతో పలకరించనున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌, టీజర్‌కు  మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్‌లో ముంబాయి మురికవాడలో ‘గల్లీబాయ్’గా అల్లరి చిల్లరిగా తిరిగే హీరో..ఎలా పాటలు పాడుతూ రాక్‌స్టార్‌గా మారాడనేదే ఈ సినిమా స్టోరీ. అంతేకాదు తండ్రి చేతిలో దెబ్బలు తినే క్యారెక్టర్ చేసాడు. మరోవైపు ఆలియా భట్ హైపర్ యాక్టివ్ క్యారెక్టర్ చేసింది. మొత్తంగా ‘గల్లీ బాయ్’ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.

ఈ సినిమాను వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నారు. మరి ‘గల్లీబాయ్’ చిత్రంతో రణ్‌వీర్ సింగ్..మరో సక్సెస్ అందుకుంటాడా లేదా వెయిట్ అండ్ సీ.

హాట్ బ్యూటీ రిచా చడ్డ మ్యాగ్జిమ్ ఫోటోషూట్



ఇవి కూడా చదవండి 

క్రిష్ జాగర్లమూడి.. చూపించాడుగా అన్నగారి వాడి వేడి..

NTR Kathanayakudu Movie Review: ఎన్.టి.ఆర్ కథానాయకుడు’

‘కాంచన 3’ గుమ్మడికాయ...కొత్త లుక్‌తో అదరగొట్టిన లారెన్స్
First published: January 9, 2019, 4:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading