‘గల్లీబాయ్’గా మారిన రణ్‌వీర్ సింగ్..‘సింబా’ తర్వాత మరో డిఫరెంట్ రోల్లో బాజీరావు

‘సింబా’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లున్న రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం జోయా అక్తర్ దర్శకత్వంలో ‘గల్లీ బాయ్’ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన లుక్‌ను రిలీజ్ చేశారు ఈ చిత్ర యూనిట్.

news18-telugu
Updated: January 2, 2019, 10:17 AM IST
‘గల్లీబాయ్’గా మారిన రణ్‌వీర్ సింగ్..‘సింబా’ తర్వాత మరో డిఫరెంట్ రోల్లో బాజీరావు
‘గల్లీబాయ్’గా రణ్‌వీర్ సింగ్
  • Share this:
రీసెంట్‌గా దీపికా పదుకొణేను పెళ్లి చేసుకొని ఒకింటి వాడైన రణ్‌వీర్ సింగ్...తాజాగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో చేసిన ‘సింబా’తో మంచి సక్సెస్‌ను అందుకున్నాడు. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ.వంద కోట్లను రాబట్టింది. అంతేకాదు ఓవర్సీస్‌లో రూ.40 కోట్లను కలెక్ట్ చేసింది. మొత్తంగా ‘సింబా’ మొత్తంగా రూ.140 కోట్ల కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది.

‘సింబా’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లున్న రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం జోయా అక్తర్ దర్శకత్వంలో ‘గల్లీ బాయ్’ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన లుక్‌ను రిలీజ్ చేశారు ఈ చిత్ర యూనిట్. ఈ సినిమాకు ‘అప్ నా టైమ్ ఆయేగా’ క్యాప్షన్‌గా పెట్టారు.

‘గల్లీ బాయ్’లో రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్


ఈ సినిమాను ముంబాయిలోని మురికివాడకు సంబంధించిన ఒక గల్లీ బాయ్ ..ఎలా జీవితంలో పైకొచ్చాడనే స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించారు.

‘గల్లీ బాయ్’గా రణ్‌వీర్


ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ రణ్‌వీర్ సింగ్ సరసన ఆలియా భట్ కథానాయికగా నటించింది. ఈ సినిమాను వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నారు.

బ్యూటీఫుల్ అంజలి లేటెస్ట్ ఫోటోస్


ఇది కూడా చదవండి 

‘మ‌హానాయ‌కుడు’ Vs ‘యాత్ర‌’.. వైసీపీ Vs టీడీపీ..

'బరైలీ కీ బర్ఫీ' రీమేక్‌లో నాగచైతన్య

దీపికా లేకుండానే కుమ్మేస్తున్న రణ్‌వీర్ సింగ్
Published by: Kiran Kumar Thanjavur
First published: January 2, 2019, 10:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading