news18-telugu
Updated: December 18, 2019, 10:08 AM IST
‘గల్లీ బాయ్’లో రణ్వీర్ సింగ్, ఆలియా భట్
92వ ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే యేడాది ఫిబ్రవరి9న ఘనంగా జరగనున్నాయి. ఈ సారి ఆస్కార్‌కు భారత్ నుంచి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో రణ్వీర్ సింగ్, ఆలియా భట్ నటించిన ‘గల్లీ బాయ్’ సినిమా నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ విభాగంలో వివిధ దేశాల నుంచి 91 నామినేషన్స్ వచ్చాయి. వాటిలో నుంచి పది చిత్రాల జాబితాను ఆస్కార్ అకాడమీ ప్రకటించింది. ఇందులో మన దేశం తరుపున ఎంపికైన ‘గల్లీబాయ్’ ఎంపిక కాకపోవడం భారతీయ ప్రేక్షకులను నిరాశ పరిచింది. దీనిపై పలువురు సెలబ్రిటీలు పలు రకారలుగా స్పందించారు. ఐతే.. కంగనా రనౌత్ సోదరి రంగోలి మాత్రం .. ‘గల్లీబాయ్’ చిత్రం హాలీవుడ్లో హిట్టైన ‘8 మైల్’ చిత్రం ఆధారంగా తెరకెక్కించారు. ఒక కాపీ చిత్రానికి అవార్డు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. అదే ‘ఉరి ది సర్జికల్ స్ట్రైక్’, ‘మణికర్ణిక’లా ఒరిజినల్ కథతో తెరకెక్కిన సినిమా కాదంది. ‘గల్లీ బాయ్’ స్టోరీ విషయానికొస్తే.. ముంబాయి మురికివాడ నుంచి వచ్చిన ఓ యువకుడు ర్యాప్ గాయకుడిగా ఎలా మారాడానేదే స్టోరీ. జోయా అక్తర్ తెరకెక్కించిన ఈ చిత్రం రూ.250 కోట్ల వసూళ్లను సాధించింది. ఇప్పటి వరకు ఆస్కార్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరిలో మన దేశం నుంచి ‘మదర్ ఇండియా’, ‘సలాం బాంబే’, ‘లగాన్’ చిత్రాలు మాత్రమే ఫైనల్ లిస్ట్‌లో నామినేషన్ దక్కించుకున్నాయి. కానీ ఈ సినిమాల్లో వేటికి ఆస్కార్ అవార్డులు రాలేదు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
December 18, 2019, 10:07 AM IST