తెలుగులో సత్తా చూపెట్టబోతున్న రణ్‌వీర్ సింగ్

రణ్‌వీర్ సింగ్

రీసెంట్‌గా ‘సింబా’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లున్న రణ్‌వీర్ సింగ్ త్వరలో జోయా అక్తర్ దర్శకత్వంలో ‘గల్లీ బాయ్’ సినిమాతో పలకరించనున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌, టీజర్,ట్రైలర్‌కు  మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ప్రేమికుల దినోత్సవ కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. మరోవైపు రణ్‌వీర్ సింగ్ చూపులు తెలుగు చిత్రసీమపై పడ్డాయి.

  • Share this:
రీసెంట్‌గా ‘సింబా’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లున్న రణ్‌వీర్ సింగ్ త్వరలో జోయా అక్తర్ దర్శకత్వంలో ‘గల్లీ బాయ్’ సినిమాతో పలకరించనున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌, టీజర్,ట్రైలర్‌కు  మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ప్రేమికుల దినోత్సవ కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది.

మరోవైపు రణ్‌వీర్ సింగ్..1983లో భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచిన నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్..అప్పటి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రలో నటిస్తున్నాడు. కబీర్ ఖాన్ డైరెక్ట్ చేస్తున్నాడు.

తాజాగా ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. భారత క్రికెట్ జట్టు సాధించిన చారిత్రక విజయాన్ని భాషలకు అతీతంగా దేశ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులందరూ తెలుసుకోవాల్సిన కథ ఇది. గతంలో ‘ఎం.ఎస్.ధోని’ సినిమా కూడా మిగతా భాషల్లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇదే రీతిలో ఇపుడు ‘83’ సినిమాను  ఒకేసారి హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం రణ్‌వీర్ సింగ్..క్రికెట్‌కు సంబంధించిన కొన్ని కిటుకులు నేర్చుకున్నాడు.

దిశాపటానీ ఫోటోస్ ఇవి కూడా చదవండి 

ఆ డైరెక్టర్ టార్గెట్ ఎన్టీఆర్..ఇంతకీ తారక్‌ను ఏం చేస్తాడో..

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లను వేధిస్తున్న సమస్య..

పుట్టినరోజున శృతిహాసన్ ఏం చేస్తుందో తెలుసా..
First published: