ఆర్ఆర్ఆర్(RRR) సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది. ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందింది. అంతేకాదు ఈ సినిమా తెలుగులో పాత రికార్డ్స్‌ను బ్రేస్తూ కేక పెట్టిస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అంతా ఆర్ఆర్ఆర్ గురించే చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్‌గా అదరగొట్టాడని కితాబిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ఆర్ఆర్ఆర్ సినిమాపై కీలక వ్యాఖ్యలు చేశాడు. Jayeshbhai Jordaar movie రిలీజ్ సందర్భంగా ప్రమోషన్లలో బిజీగా ఉన్న రణ్ వీర్ సింగ్.. తాజాగా ఆర్ఆర్ సినిమాపై కీలక కామెంట్స్ చేశాడు. ఇటీవలే తాను ఆర్ఆర్ఆర్ సినిమా చూశానన్నాడు. మూడు గంటల పాటు.. సినిమా హాల్లో ఓ...ఓ.. అన్న డైలాగ్స్ వినిపిస్తూ ఉన్నాయన్నాడు. అంతేకాకుండా తనకు ఆర్ఆర్ఆర్ సినిమాలో ఓ సీన్ అద్భుతంగా నచ్చిందన్నారు.ట్రైన్స్ వెళ్తుండగా ఇద్దరు హీరోలు చేతులు పట్టుకున్న సీన్ సూపర్ అంటూ.. ఆసీన్ చూసి తాను చైర్లో నుంచి కిందపడినంత పని అయ్యిందంటూ.. కామెంట్లు చేశారు. రాజమౌళి డైరెక్షన్ చూస్తుంటే..సీట్లో కూర్చోలేకపోయామన్నాడు రణ్ వీర్ సింగ్.
దీంతో రణ్ వీర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో రణ్ వీర్ కామెంట్స్ చూసిన తెలుగు ఆడియన్స్.. రాజమౌళి తీస్తే అట్లానే ఉంటాదంటూ కామెంట్లు పెడుతున్నారు.కొందరు మాత్రం రణ్ వీర్‌కు నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు. పట్టు పట్టు నువ్వెంత కాక పట్టినా పర్వాలేదు మరి అంటూ ఓ నెటిజన్ పోస్టు చేశారు. నువ్వెంత వెన్న రాసిన నీతో ఎప్పుడూ తీయడు అని మరో నెటిజన్ పోస్టు చేశాడు.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.