ఆ హీరోయిన్‌‌‌కు కరోనా వైరస్‌ సోకిందా.. సోషల్ మీడియాలో వైరల్..

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న జీవి కరోనా వైరస్. చైనాలో పుట్టిన ఈ వైరస్ చైనా చుట్టుపక్కల దేశాలకు సోకింది

news18-telugu
Updated: February 4, 2020, 1:57 PM IST
ఆ హీరోయిన్‌‌‌కు కరోనా వైరస్‌ సోకిందా.. సోషల్ మీడియాలో వైరల్..
Instagram
  • Share this:
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న జీవి కరోనా వైరస్. చైనాలో పుట్టిన ఈ వైరస్ దాని చుట్టుపక్కల దేశాలకు సోకింది. దీంతో కరోనా బారినపడి ఇప్పటికే చైనాలో 400మందికి పైగా మృతి చెందారు. దాని పక్కన దేశం ఫిలిప్పైన్స్‌లో ఒకరు మృతి చెందారు. ఈ వైరస్ ఇటు భారత్ తో పాటు మరో 20 ఈ దేశాలకి వ్యాప్తించింది. మనదేశంలోనూ కరోనా వేగంగా వ్యాప్తిస్తోంది. కేరళలో ఇప్పటికే మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి ఇద్దరు చికిత్స పొందుతున్నారు. తాజాగా ఈ సంఖ్య మూడుకు చేరింది. కేరళలో మరో కేసు నిర్ధారణ అయ్యింది. కేరళ కాసర్‌గోడ్ జిల్లాలో ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు. దీంతో భారత్‌లో కరోనా వైరస్ వ్యాపించకుండా కట్టడి చేసేందుకు అన్ని రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ వైరస్ సోకితే ఎలాంటి మందులు లేవు. ఇప్పటివరకు ఎలాంటి చికిత్స అందుబాటులోకి రాలేదు. దీంతో రాష్ట్రాల అధికార యంత్రాంగాలు ప్రత్యేక వైద్య పరీక్షలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అది అలా ఉంటే ఈ కరోనా వైరస్ సోకిన లక్షణాలతో ఓ హీరోయిన్ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. బోజ్ పురి హీరోయిన్ రాణీ ఛటర్జీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె తన సోషల్ మీడియాలో రాస్తూ.. 'గత10 రోజులుగా జ్వరం, జలుబు, తలనొప్పి, మైగ్రేన్‌తో బాధపడుతున్నా'నని రాణీ ఛటర్జీ తెలుపుతూ.. కరోనా వైరస్ లక్షణాలు ఎదుర్కొంటున్నానేమోనని అనుమానం వ్యక్తం చేసింది. దీంతో ఆమె అభిమానులు పలు ఆగోగ్య సూచనలు చేస్తూ.. జాగ్రత్త అంటూ ఆమె బాగుండాలని ప్రార్ధనలు చేస్తున్నారు. 

View this post on Instagram
 

पीछले १० दिन से कोल्ड और बुखार से परेशान हू पर इस तस्वीर को देख के लगेगा मै ठीक हूं जी नहीं ... मुस्कान झूठी है 🙆🙆🙆🙆


A post shared by Rani Chatterjee Official (@ranichatterjeeofficial) on
First published: February 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు