Jabardasth Comedy show: నాలుగేళ్ల తర్వాత జబర్దస్త్‌కు రీ ఎంట్రీ ఇచ్చిన కమెడియన్..

జబర్దస్త్ కామెడీ షో లోగో (jabardasth comedy show)

Jabardasth Comedy show: జబర్దస్త్ కామెడీ షో అనేది కేవలం ఓ స్టేజ్ మాత్రమే కాదు.. అదొక ప్రయోగశాల. టాలీవుడ్‌కు ఎంతోమంది నటులను అందించిన అద్భుతమైన వేదిక. ముడిసరుకుగా వచ్చిన వాళ్లను మంచి నటులుగా తీర్చిదిద్దుతుంది ఈ షో.

  • Share this:
జబర్దస్త్ కామెడీ షో అనేది కేవలం ఓ స్టేజ్ మాత్రమే కాదు.. అదొక ప్రయోగశాల. టాలీవుడ్‌కు ఎంతోమంది నటులను అందించిన అద్భుతమైన వేదిక. ముడిసరుకుగా వచ్చిన వాళ్లను మంచి నటులుగా తీర్చిదిద్దుతుంది ఈ షో. ఇందులో నుంచి చాలా మంది కమెడియన్లు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అందులో కొందరు వెండితెరపై కూడా సక్సెస్ అయ్యారు. మరికొందరు మాత్రం అక్కడే ఉండిపోయారు. ఇదిలా ఉంటే ఈ షో నుంచి ఎంతోమంది నటులు బయటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ వీలు దొరికినపుడు వచ్చేసారు. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా మంచి స్కిట్స్‌తో ఆకట్టుకున్నారు. షకలక శంకర్, చలాకీ చంటి వాళ్లు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయి రెండు మూడేళ్ల పాటు గ్యాప్ తీసుకుని వచ్చారు. ఇప్పుడు కూడా ఓ కమెడియన్ అలాగే చేసాడు. దాదాపు నాలుగేళ్ళ తర్వాత జబర్దస్త్ సెట్‌పై మళ్లీ కనిపించాడు. అతడే మహేష్.. ఒకప్పుడు కిరాక్ ఆర్పీ స్కిట్‌లో కనిపించేవాడు ఆయన. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడంతో అక్కడే ఉండిపోయాడు. రంగస్థలం సినిమాతో ఒక్కసారిగా మహేష్ పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. సుకుమార్‌ను సతాయించి ఈ అవకాశం దక్కించుకున్నాడు మహేష్. చాలా రోజుల తర్వాత ఆయన వెంట తిరిగి తిరిగి ఈ ఆఫర్ సొంతం చేసుకున్నాడు. అనుకున్నట్లుగానే అప్పటి వరకు శతమానం భవతి మహేష్‌గా ఉన్నోడు రంగస్థలం మహేష్ అయిపోయాడు.

అదే ఊపులో వరస సినిమాలు చేస్తున్నాడు ఈ కమెడియన్. 2020లో లాక్ డౌన్ సమయంలోనే ఓ ఇంటి వాడు కూడా అయిపోయాడు మహేష్. ఈయన చాలా రోజుల తర్వాత మళ్లీ జబర్దస్త్ స్టేజీపై దర్శనం ఇచ్చాడు. సినిమా ప్రమోషన్ కోసం వచ్చాడా లేదంటే రీ ఎంట్రీ ఇచ్చాడా అనేది పక్కనబెడితే చాలా రోజుల తర్వాత వచ్చిన ఈయనకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మహేష్ రాగానే విజిల్స్ వేసి మరీ స్వాగతం పలికింది రోజా. సుడిగాలి సుధీర్ స్కిట్‌లో కనిపించాడు రంగస్థలం మహేష్. మరి ఈయన కామెడీ ఎలా ఉండబోతుందో వచ్చే వారం తెలియనుంది.
Published by:Praveen Kumar Vadla
First published: