RANGASTHALAM DIRECTOR SUKUMAR SHOCKING COMMENTS ON SAMANTHA TA
‘రంగస్థలం’ కోసం ముందుగా సమంతను రిజెక్ట్ చేసాను.. సుకుమార్ షాకింగ్ కామెంట్స్..
సమంత,సుకుమార్ (ఫైల్ ఫోటో)
చిట్టిబాబుగా రామ్ చరణ్, రామలక్ష్మిగా సమంత నటించిన 'రంగస్థలం' సంచలన 2018లో సంచలన విజయం సాధించింది. ఈ సినిమా లో రామలక్ష్మి, చిట్టిబాబు పాత్రల్లో సమంత, రామ చరణ్‌లు అద్భుతంగా ఒదిగిపోయారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుకుమార్ రామలక్ష్మి పాత్ర కోసం వేరే వాళ్లను అనుకున్నాడట.
చిట్టిబాబుగా రామ్ చరణ్, రామలక్ష్మిగా సమంత నటించిన 'రంగస్థలం' సంచలన 2018లో సంచలన విజయం సాధించింది. ఈ సినిమా లో రామలక్ష్మి, చిట్టిబాబు పాత్రల్లో సమంత, రామ చరణ్‌లు అద్భుతంగా ఒదిగిపోయారు. డిజిటల్ యుగంలో 1980 నాటి స్టోరీతో గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి జనరేషన్‌కు కొత్తగా అనిపించింది. అందుకే ఈసినిమాకు ప్రజలు ఆదరించారు.మరోవైపు ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో నటించిన ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, నరేశ్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ‘రంగస్థలం’ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో పాటు రూ.115 కోట్ల షేర్ రాబట్టినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి. తాజాగా ‘రంగస్థలం’ సినిమా గురించి అందులో రామలక్ష్మిగా చేసిన సమంత పాత్ర గురించి దర్శకుడు సుకుమార్..ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసారు.
రంగస్థలం కన్నడ వెర్షన్
ఇక ‘రంగస్థలం’ చిత్రం గురించి సమంత ను సంప్రదించే సరికి ఆమెకు పెళ్లైపోయింది. ఆమె ఒప్పుకున్న ఎక్కడో నాకు చిన్న డౌట్ ఉండేది పెళ్లి తర్వాత సమంత ఒక హీరోయిన్గా ఈ సినిమాలో యాక్సెప్ట్ చేస్తారా అనేది. అందుకే సమంత
ఈ సినిమా ఒప్పకున్న ఆ పాత్ర కోసం చివరి వరకు వేరే హీరోయిన్స్ కోసం వెతికాను. కొత్త కథానాయికగా దొరకగానే సమంతకు సారీ చెబుదామనుకున్నాను. ఇక ముందుగా ఈ సినిమా ప్రారంభించే ముందు అనుపమ పరమేశ్వరన్‌ను కూడా అనుకున్నాము. కానీ చివరగా సమంతనే ఎంపిక చేసాం. కానీ ఆ తర్వాత సినిమా షూటింగ్ లో రామ్ చరణ్,సమంతను ఎంత సింపుల్ గా డీల్ చెయ్యచ్చో అర్ధం అయింది.
‘రంగస్థలం’లో రామలక్ష్మి
సామ్ ఈ చిత్రంలో నటించిన విధానం,ఎక్స్ప్రెషన్స్ చూసినప్పుడల్లా సమంతను కాకుండా వేరే ఎవరిని ఈ క్యారెక్టర్లో తీసుకున్న ఇంత బాగా నటించి ఉండేవారు కాదేమే అని నాకు అనిపించింది. అందుకే రంగస్థలం ఆడియో ఫంక్షన్ లో అందరిముందు చెప్పా ఇక నా లైఫ్ మొత్తం ఆమె తో సినిమాలు చేస్తూనే వుంటానని. ఏమైనా రామలక్ష్మిగా సమంత పాాత్రలేని రంగస్థలం సినిమాను ఊహించుకోవడం కొంచెం కష్టమనే చెప్పాలె.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.