రంగమ్మత్తగా అనసూయ మొదటి ఛాయిస్ కాదంట..

రాంచరణ్ సినిమా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన  ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్రకు మంచి ప్రాధాన్యత లభించింది. ముందుగా ఈ క్యారెక్టర్ అనసూయ కంటే ముందు.. ఆ సీనియర్ హీరోయిన్ దగ్గరకు వెళ్లింది.

news18-telugu
Updated: November 13, 2019, 9:33 AM IST
రంగమ్మత్తగా అనసూయ మొదటి ఛాయిస్ కాదంట..
రంగమ్మత్తగా అనసూయ (File Photo)
  • Share this:
రాంచరణ్ సినిమా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన  ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్రకు మంచి ప్రాధాన్యత లభించింది.  ఈ కేరక్టర్ లో నటించడమే కాదు అందులో జీవించిన యాంకర్ అనసూయకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా అనసూయ కెరీర్లో ఒక మైలు రాయి అనే చెప్పవచ్చు.ఈ సినిమా సక్సెస్‌తో అనసూయ కేవలం గ్లామర్ పాత్రలే కాదు.. పర్ఫామెన్స్ ఓరియంటెడ్ పాత్రలకు కూడా  పనికిస్తుందననే విషయం తెలిసింది. దీంతో దర్శక,నిర్మాతలు అనసూయను దృష్టిలో పెట్టుకొని మరి ఆమె క్యారెక్టర్‌ను డిజైన్ చేస్తున్నారు. మరి అలాంటి రంగమ్మత్త కేరక్టర్ ను ఓ స్టార్ హీరోయిన్ వదులుకున్నాను అని చెప్పి బాంబ్ పేల్చింది. ఆమె ఎవరో కాదు సీనియర్ హీరోయిన్ రాశి. ఇటీవల రాశి.. ఆలీతో జాలీగా కార్యక్రమంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నారు. అందుకు కారణం కూడా చెప్పింది.

rangastalam movie rangammattha character was dropped by famous star heroin raasi
అనసూయ, రాశి


తనకు కేరక్టర్ నచ్చిందని అయితే రంగమ్మత్త పాత్రలో మోకాళ్ల మీదకు చీర కట్టడం ఇష్టం లేకనే ఈ పాత్రను రిజెక్ట్ చేసినట్టు చెప్పింది. ఏమైనా ఆ పాత్ర ఒదులుకున్నందకు తనేకేం బాధ లేదంటూ చెప్పుకొచ్చింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 13, 2019, 9:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading