హోమ్ /వార్తలు /సినిమా /

Ranga Ranga Vaibhavanga: ప్రముఖ ఓటీటీలో రంగ రంగ వైభవంగా.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు..

Ranga Ranga Vaibhavanga: ప్రముఖ ఓటీటీలో రంగ రంగ వైభవంగా.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు..

Ranga Ranga Vaibhavanga seals its OTT release date Twitter

Ranga Ranga Vaibhavanga seals its OTT release date Twitter

Ranga Ranga Vaibhavanga OTT: వైష్ణవ్ మూడో సినిమా రంగ రంగ వైభవంగా (Ranga Ranga Vaibhavanga ).. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 2న విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. గిరీశయ్య దర్శకత్వం వహించగా.. కేతిక శర్మ హీరోయిన్‌గా చేసింది. ఇక అది అల ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ అప్ డేట్ వచ్చింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

    మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వైష్ణవ్.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు వైష్ణవ్. ఉప్పెన తర్వాత ఆయన నటించిన సినిమా కొండపొలం (Kondapolam). ఈ చిత్రం 2021 అక్టోబర్ 8న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓకే అనిపించింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో (Kondapolam on Amazon Prime) స్ట్రీమ్ అవుతోంది. ఇక అది అలా ఉంటే వైష్ణవ్ మూడో సినిమా రంగ రంగ వైభవంగా (Ranga Ranga Vaibhavanga ).. ఈ సినిమా  సెప్టెంబర్ 2న విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.  ఈ సినిమాకి తొలి ఆటకే ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అంతేకాదు వైష్ణవ్ తేజ్ కెరీర్‌లో చేసిన టోటల్ మూడు సినిమాల్లో ఈ సినిమానే వీక్ ఓపెనింగ్స్ ని అందుకుంది.

    ఇక ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 2, 2022న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. దీంతో ఈ సినిమాను థియేటర్‌లలో మిస్ అయిన వారు వచ్చే నెల నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ఎంజాయ్ చేయోచ్చు.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో నవీన్ చంద్ర, సుబ్బరాజు, నరేష్, ప్రభు తదితరులు నటించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాను మొదట జూలై 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు టీమ్ అయితే.. ఏవో కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది.  యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకు గిరీశయ్య దర్శకుడు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణం వహించారు.

    ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసింది టీమ్.  కొత్తగా లేదేంటి' అంటూ సాగుతోన్న పాట  నెటిజన్స్‌ను  ఆకట్టుకుంటోంది. రొమాంటిక్‌గా సాగుతోన్న పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ పాటను అర్మాన్ మాలిక్, హరిప్రియ పాడగా.. శ్రీమణి లిరిక్స్ అందించారు.   రొమాంటిక్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ (Ketika sharma) కేతిక శర్మ ఇందులో వైష్ణవ్ తేజ్‌ సరసన నటించింది. మొదటి రెండు సినిమాలతో పోలిస్తే.. రంగరంగ వైభవంగా కోసం మరింత స్టైలిష్‌గా మారిపోయారు వైష్ణవ్.

    వైష్ణవ్ తేజ్ లేటెస్ట్ సినిమా కొండపొలం విషయానికి వస్తే.. ర‌వీంద్ర‌నాథ్ గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన వ్యక్తి. బిటెక్ చేసిన రవి ఉద్యోగం కోసం హైద‌రాబాద్ వస్తాడు. ఎంత ప్ర‌య‌త్నించినా రవి ఉద్యోగం రాదు. దీంతో తన సొంత ఊరికి చేరుతాడు. ఇక తన తండ్రితో పాటు గొర్రెల్ని మేప‌డం కోసం కొండ‌పొలానికి వెళ‌్లడం అక్కడ ఏం జరిగింది. రకుల్ పాత్ర ఏమిటీ. రవి ఐ.ఎఫ్‌.ఎస్‌ ఎలా ఎంపిక అయ్యాడు అనేవి కథలో ముఖ్యాంశాలు. ఈ సినిమాలో (Rakul Preet Singh) రకుల్ ప్రీత్ సింగ్ డిగ్లామర్‌గా ఓబులమ్మ అనే పాత్రను చేసారు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్నంతగా అలరించలేకపోయింది.

    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Ranga Ranga Vaibhavanga, Tollywood news

    ఉత్తమ కథలు