Ranga Maarthaanda: రంగమార్తాండ సినిమాలోని ఫస్ట్ సింగల్ (షాయరి) నేనొక నటుడ్ని విడుదలయ్యింది. మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో చెప్పిన ఈ షాయరీ ను రచయిత లక్ష్మీ భూపాల రచించారు. మాస్ట్రో ఇళయరాజా నేపధ్య సంగీతం అందించారు. ఈ షాయరీ వినే ప్రతి నటుడు తన కోసమే రాశారని భావించేలా లక్ష్మీ భూపాల ఎంతో అర్థవంతంగా రాశారు. మెగాస్టార్ అద్భుతంగా తన గొంతులో నవరసాలు పలికించి ఈ షాయిరీకి ప్రాణం పోశారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఒక తపస్సులా పూర్తి చేసిన ఈ రంగమార్తాండ సినిమాకు ఈ షాయరీ అద్దం పడుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’. రంగస్థల కళాకారుల జీవితాల చుట్టూ అల్లిన ఈ కథలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాని రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజ, అనసూయ, కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ‘కృష్ణ వంశీ’ (Krishna Vamsi) చాలాకాలం తర్వాత ‘రంగమార్తాండ’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అంతేకాదు త్వరలో విడుదలకు కూడా సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే విడుదలైన సినిమాకు సంబంధించి టైటిల్ లోగోను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఇళయరాజా సంగీతం సారధ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో కీలకపాత్రలో వర్సటైల్ యాక్టర్ రమ్యకృష్ణ కనిపించనుంది.
అన్నయ్యకు కృతజ్ఞతాభివందనం♥️???? ఇదే ఆ తెలుగు షాయరీ. ఒక అరుదైన ఆలోచనకు లక్ష్మీభూపాల్ అందమైన అక్షరరూపం. సంగీతదైవం ఇళయరాజా గంథర్వస్వరాలతో. నటమర్తాండ అపురూప గళమాథుర్యంలో...
మీకు నచ్చుతుందని ఆశిస్తూ. శుభాకాంక్షలు????❤https://t.co/Vmvm9vXhfH @KChiruTweets #NenokaNatudni #Rangamarthanda — Krishna Vamsi (@director_kv) December 21, 2022
కృష్ణవంశీ దాదాపు 20 సంవత్సరాల తరువాత తన సతీమణి (Ramya Krishna) రమ్యకృష్ణను డైరెక్ట్ చేస్తున్నాడు. దీనికి తోడు కృష్ణంశీ నుంచి చాలా కాలం తర్వాత ఓ సినిమా వస్తుండడంతో మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన నుంచి సినిమాలు వస్తున్నాయంటే ఓ క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమాలు చాలా ప్రత్యేకమైనవి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆయనకు సరైన హిట్ లేదు. రామ్ చరణ్‌తో తీసిన గోవిందుడు అందరివాడేలే పరవాలేదనిపించింది.
ఇక ఆయన తాజా సినిమా ఓ మరాఠి క్లాసిక్ సినిమా ‘నట సమ్రాట్’ మూవీకి రీమేక్‌గా వస్తోంది. అక్కడ నానా పాటేకర్ ముఖ్యపాత్రలో నటించారు. కృష్ణవంశీ చిత్రాన్ని అన్ని విధాలా గొప్పగా ఉండేలా రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రఖ్యాత సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఇక ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల విషయానికి వస్తే... ఒరిజినల్ చిత్రం నటసామ్రాట్‌లో నానా పాటేకర్ పోషించిన పాత్రని ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత బ్రహ్మనందం కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Krishna vamsi, Ranga Marthanda, Tollywood