Rang De: రంగ్ దే షూటింగ్ పూర్తి.. ఫన్నీ బూమేరాంగ్ రిలీజ్ చేసిన నితిన్, కీర్తి

రంగ్ దే

Nithiin- Keerthy Suresh: నితిన్ హీరోగా వెంకీ అట్లూరీ తెర‌కెక్కించిన చిత్రం రంగ్‌దే. రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో నితిన్ స‌ర‌స‌న తొలిసారిగా కీర్తి సురేష్ జ‌త క‌ట్టింది. ఇక ఈ మూవీ షూటింగ్ తాజాగా పూర్తి అయ్యింది. ఈ విష‌యాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది.

  • Share this:
    Nithiin- Keerthy Suresh: నితిన్ హీరోగా వెంకీ అట్లూరీ తెర‌కెక్కించిన చిత్రం రంగ్‌దే. రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో నితిన్ స‌ర‌స‌న తొలిసారిగా కీర్తి సురేష్ జ‌త క‌ట్టింది. ఇక ఈ మూవీ షూటింగ్ తాజాగా పూర్తి అయ్యింది. ఈ విష‌యాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. రంగ్‌దే షూటింగ్ పూర్తి అయ్యింది. హోలీ రోజున థియేట‌ర్ల‌లో క‌లుసుకుందాం అని నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్ర‌క‌టించింది. మ‌రోవైపు ఈ మూవీ షూటింగ్ పూర్తైన విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకున్న నితిన్, కీర్తి సురేష్.. ఓ ఫ‌న్నీ బూమేరాంగ్‌ని అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు. అందులో ఈ మూవీ సినిమాటోగ్రాఫ‌ర్ పీసీ శ్రీరామ్ నిల్చొని ఉండ‌గా.. నితిన్, కీర్తి, వెంకీ అట్లూరీ, వెన్నెల కిషోర్‌లు డ్యాన్స్ వేస్తున్నారు. ఈ వీడియో అభిమానుల‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది. ఇక మంచి టీమ్‌ని మిస్ అవుతున్నామంట ఆ ఇద్ద‌రు కామెంట్ పెట్టారు.

    కాగా ఈ మూవీపై అభిమానుల్లో మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన టీజ‌ర్‌, ఒక పాట అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. దీంతో సినిమా కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మ‌రోవైపు షూటింగ్‌ని పూర్తి చేసుకున్న టీమ్.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను ప్రారంభించ‌డంతో పాటు ప్ర‌మోష‌న్ల‌లో వేగాన్ని పెంచ‌నుంది. ఈ క్ర‌మంలో ఈ సినిమా నుంచి రెండో పాట‌ను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్నారు.






    ఇదిలా ఉంటే చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ నటించిన చెక్ మూవీ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీలో నితిన్ స‌ర‌స‌న ప్రియ వారియ‌ర్ న‌టించ‌గా.. ర‌కుల్ ప్రీత్ సింగ్ మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ట్రైల‌ర్‌తో ఆక‌ట్టుకున్న ఈ మూవీపై మంచి అంచ‌నాలు ఉన్నాయి.
    Published by:Manjula S
    First published: