• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RANG DE DIRECTOR VENKY ATLURI WANTS TO REMAKE NAGARJUNA DISASTER MOVIE RAKSHAKUDU NOW PK

Nagarjuna: ‘రక్షకుడు’ సినిమాను రీమేక్ చేయాలని ఉందన్న వెంకీ..

Nagarjuna: ‘రక్షకుడు’ సినిమాను రీమేక్ చేయాలని ఉందన్న వెంకీ..

రక్షకుడు సినిమా (Rakshakudu movie)

Nagarjuna: నాగార్జున (Nagarjuna) కెరీర్‌లో అత్యంత దారుణంగా నిరాశ పరిచిన సినిమాల్లో రక్షకుడు(Rakshakudu) కూడా ఉంటుంది. ప్రవీణ్ గాంధీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో కుంజుమన్ నిర్మించాడు. 1997లో విడుదలైన ఈ చిత్రం నాగార్జున కెరీర్‌లోనే హైయ్యస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కింది.

  • Share this:
సాధారణంగా ఫ్లాప్ సినిమా అంటేనే భయపడుతుంటారు దర్శక నిర్మాతలు. హీరోలకు కూడా అలాంటి సినిమాలంటే భయం. అలాంటిది అలా ఫ్లాప్ అయిన సినిమాలను రీమేక్ చేయాలనుకునే వాళ్లు ఎవరైనా ఉంటారా..? ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఓ ఫ్లాప్ సినిమాను రీమేక్ చేయాలని ఒక దర్శకుడు కలలు కంటున్నాడు. నాగార్జున కెరీర్‌లో అత్యంత దారుణంగా నిరాశ పరిచిన సినిమాల్లో రక్షకుడు కూడా ఉంటుంది. ప్రవీణ్ గాంధీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో కుంజుమన్ నిర్మించాడు. 1997లో విడుదలైన ఈ చిత్రం నాగార్జున కెరీర్‌లోనే హైయ్యస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కింది. కానీ అంచనాలు దారుణంగా తప్పింది. అప్పట్లో రెండు భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు గాంధీ. ఆకాశమంత అంచనాలతో వచ్చిన రక్షకుడు అడ్రస్ లేకుండా పోయింది. ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్సులు కూడా మరో స్థాయిలో ఉంటాయి. అప్పట్లోనే ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యాయి. అలాంటి సినిమాను ఇప్పుడు రీమేక్ చేయాలని ఉందని ఓ దర్శకుడు చెప్పాడు. ఫ్లాప్ సినిమా అని తెలిసినా కూడా రీమేక్ చేయాలనుకోవడం నిజంగానే విడ్డూరంగా అనిపిస్తుంది.

ఆ దర్శకుడు ఎవరో కాదు వెంకీ అట్లూరీ. ఈయన బై బర్త్ నాగార్జున అభిమాని. చిన్నప్పటి నుంచి కూడా నాగార్జున అంటే ప్రాణమిస్తాడు ఈయన. ప్రతీ సినిమాను చూస్తుంటాడు కూడా. నాగార్జున చేసిన కొన్ని సినిమాల నుంచే తనకు దర్శకుడు కావాలనే ఆలోచన పుట్టిందని.. ఓ సినిమాను చూసే విధానమే మారిపోయిందని ఈ మధ్యే రానా దగ్గుబాటి షోకు వచ్చిన వెంకీ అట్లూరి చెప్పుకొచ్చాడు.
Nagarjuna,Nagarjuna twitter,Nagarjuna instagram,Nagarjuna venky atluri,Nagarjuna rakshakudu movie,rakshakudu movie remake venky atluri,telugu cinema,నాగార్జున రక్షకుడు,వెంకీ అట్లూరి రక్షకుడు రీమేక్,వెంకీ అట్లూరీ రక్షకుడు రానా దగ్గుబాటి షో
వెంకీ అట్లూరి (Venky Atluri)

తనకు 90ల నుంచి ఏదైనా సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నావా అని అడిగితే.. రక్షకుడు అంటూ సమాధానం చెప్పాడు వెంకీ అట్లూరి. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు కానీ కచ్చితంగా ఇంకా బాగా తీయొచ్చు.. అందులో చాలా మంచి యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయని చెప్పాడు వెంకీ. దాంతో పాటు అశ్వమేథం సినిమాను కూడా రీమేక్ చేయాలని ఉందని చెప్పాడు. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. 90ల్లో నుంచి తాను రీమేక్ చేయాలనుకునే సినిమాలు ఈ రెండే అని చెప్పాడు ఈయన.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు