RANDHIR KAPOOR COVID 19 POSITIVE AND HIS SHIFTED TO ICU FOR FURTHER TESTS TA
Randhir Kapoor Covid-19 Positive: కోవిడ్ బారిన పడ్డ బాలీవుడ్ సీనియర్ హీరో రణ్‌ధీర్ కపూర్..
బాలీవుడ్ సీనియర్ హీరో రణ్‌ధీర్ కపూర్‌కు కరోనా పాజిటివ్ (Twitter/Photo)
Randhir Kapoor Covid-19 Positive: మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాలుస్తోంది. గత మూడు, నాలుగు వారాలుగా దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరో రణ్‌ధీర్ కపూర్ కరోనా బారిన పడ్డారు.
Randhir Kapoor Covid-19 Positive: మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాలుస్తోంది. గత మూడు, నాలుగు వారాలుగా దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో షూటింగ్లలో పాల్గొంటున్న సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటులు కరోనా బారిన పడ్డారు. దీంతో ముందు షెడ్యూల్ చేసుకున్న షూటింగ్‌లు క్యాన్సిల్ కావడంతో నిర్మాతలపై పెను భారం పడుతోంది. ఇప్పటికే అక్షయ్ కుమార్, గోవిందా వంటి ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పూజా హెగ్డే, అల్లు అర్జున్ వంటి టాలీవుడ్ ప్రముఖలు కరోనా బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు రణ్‌ధీర్ కపూర్.. కరోనా బారిన పడ్డారు. ఈయన వయసు 74 యేళ్లు. శ్వాసకోశ సమస్యతో ఈయన ముంబాయిలోని కోకిలా బెన్ అంబాని హాస్పిటల్లో చేరారు. ఆయనకు కోవిడ్ పరీక్ష చేయగా కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందంటూ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన్ని మరిన్ని హెల్త్ టెస్టుల కోసం ఐసీయూకు తరలించారు.
రణ్‌ధీర్ కపూర్ విషయానికొస్తే.. ఈయన బాలీవుడ్ లెజండరీ నటుడు రాజ్ కపూర్ పెద్ద కుమారుడు. ఈయన కుమార్తెలు కరీనా కపూర్, కరిష్మా కపూర్ బాలీవుడ్ అగ్ర హీరోయిన్లుగా సత్తా చాటారు. ఈయన తమ్ముడు కుమారుడు రణ్‌బీర్ కపూర్ బాలీవుడ్ అగ్ర హీరోగా రాణిస్తున్నాడు. ఇక గతేడాది ఇదే రోజు రణ్‌ధీర్ కపూర్... పెద్ద సోదరుడు రిషీ కపూర్.. కాన్సర్తోొ పోరాడుతూ కన్నుమూసారు. ఇంకోవైపు ఈయన చిన్న సోదరుడు రాజీవ్ కపూర్ ఈ యేడాది ఫిబ్రవరి హార్ట్ ఎటాక్‌తో కన్నుమూసారు. తాజాగా ఈయన కోవిడ్ బారిన పడటంతో కపూర్ ఫ్యామిలీ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈయన త్వరగా కోలుకోవాలంటూ ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.