బాలీవుడ్లో మరో జంట ప్రేమించి పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ హీరో రణ్‌బీర్...హీరోయిన్ ఆలియా భట్ల వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లికి సంబంధించి చర్చ సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా జరుగుతోంది. సెలబ్రిటీల వివాహం అంటే రకరకాల వార్తలు బయటకు వస్తాయి. ఏ చిన్న విషయం బయటకు పొక్కిన దాన్ని ఫ్యాన్స్, నెటిజన్స్ మరింత వైరల్ చేస్తుంటారు. ఇప్పుడు ఆలియా రణ్‌బీర్‌కు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా వీరికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.. రణబీర్ తన కాబోయే భార్యకు కాస్ట్లీ కనుక ఇచ్చాడట.. అంతేకాదు ఆ కానుకకు మరొక పత్యేకత కూడా ఉందట.. అలియాకు 8 నెంబర్ లక్కీ అని చాలా మందికి తెలుసు.. ఇదే సెంటిమెంట్ తో 8 ఖరీదైన వజ్రాలు పొదిగిన వెడ్డింగ్ బ్యాండ్ ను తయారు చేయించి అలియాకు బహుమతిగా ఇచ్చాడని టాక్ నడుస్తుంది. ఇప్పుడు ఈ వార్త బిటౌన్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. అందరూ ఆలియాకు రణ్‌బీర్ ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్ పై చర్చించుకుంటున్నారు.
రణబీర్ కపూర్-అలియాభట్ వివాహం గురువారం ఇరు కుటుంబాలు..అతికొద్ది మంది అతిధుల సమక్షంలో బాంద్రాలోని వాస్తు అపార్ట్ మెంట్ లో వైభవంగా జరిగింది. ఈ విషయాన్ని అలియాభట్ అభిమానులతో పంచుకున్నారు. వివాహానికి సంబంధించిన ఫోటోల్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు. ఈ సందర్భంగా పెళ్లికి సంబంధించి అలియాభట్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ``గత ఐదేళ్లగా మేము ఏ బాల్కనీలో అయితే ప్రేమించుకున్నామో అక్కడే మా వివాహం జరిగింది. ఎంతో సంతోషంగా ఉంది`` అని తెలిపారు. అలాగే అలియా- రణబీర్ వివాహం సందర్భంగా ఎంతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు షేర్ చేసారు. నవ దంపతులు పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్నారు.
మరోవైపు ఈ కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. . అలాగే అన్ని పరిశ్రమలో నటులు..నిర్మాతలు విషెస్ తెలియజేస్తున్నారు. ఈనెల 17న ముంబైలో ని ఓ స్టార్ హోటల్ లో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేసారు. ఆ కార్యక్రమానికి బాలీవుడ్..టాలీవుడ్ సెలబ్రిటీలంతా హాజరయ్యే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Alia Bhatt, Bollywood, Ranbir Kapoor