దీపికాతో బ్రేకప్ విషయమై రణ్‌బీర్ కపూర్ సంచలన నిజాలు..

బాలీవుడ్‌‌లో కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నాల్గో తరం నట వారుసుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రణ్‌వీర్ కపూర్. తాజాగా ఈయన దీపికాతో బ్రేకప్ విషయమై స్పందించాడు.

news18-telugu
Updated: April 25, 2020, 5:47 PM IST
దీపికాతో బ్రేకప్ విషయమై రణ్‌బీర్ కపూర్ సంచలన నిజాలు..
రణబీర్ కపూర్‌తో దీపికా పదుకొనే
  • Share this:
బాలీవుడ్‌‌లో కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నాల్గో తరం నట వారుసుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రణ్‌వీర్ కపూర్. ఈయన గతంలో హీరోయిన్ కత్రినా కైఫ్‌తో పాటు దీపికా పదుకొణేతో చాలా రోజులు ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే కదా. ఐతే..  దీపికాతో బ్రేకప్ విషయమై ఆమె తల్లి నీతూ కపూర్ కారణమనే వార్తలు చాలా క్రితం వచ్చాయి. ఆ వార్తపై రణ్‌బీర్ కపూర్ స్పందించారు. దీపికా, నేను విడిపోవడం వెనక మా అమ్మతో పాటు ఎవరు లేరు. మేమిద్దరం వ్యక్తిగతంగానే మా ఇష్ట ప్రకారమే విడిపోయామని చెప్పుకొచ్చాడు. రణ్‌బీర్ కపూర్ విషయానికొస్తే.. ఈయన సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘సావరియా’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కథానాయకుడిగా ‘రాక్‌స్టార్’, బర్పీ’  తమాసా, యే దిల్ హై ముష్కిల్’ సినిమాతో పాటు ‘సంజు’ బయోపిక్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు.

ranbir kapoor agrees cheated deepika padukone in relationship
దీపికా, రణ్‌‌బీర్ కపూర్ (File/Photo)


ఇక మొదటి చిత్రం తగిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ నేను ఎంతో ఇష్టపడి ఆ సినిమా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాతో నేను ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నానన్నారు. ఐతే.. దీపికాతో విడిపోవడంపై స్పందిస్తూ.. మేమిద్దరం విడిపోవడానికి నా తల్లి కారణమనే వార్తలను తోసిపుచ్చాడు. మేమిద్దరం విడిపోవడానికి మా వ్యక్తిగతం అన్నారు. ప్రేమ అనేది ఇద్దరు మనుషులకు సంబంధించిన విషయం. ఇక ఏ తల్లి కైనా తన కొడుకు అంటే ఎంతో ఇష్టముంటుంది. నా పర్సనల్ లైఫ్‌లో నా తల్లి జోక్యం ఉండదన్నారు. ఇక దీపికా అంటే మా అమ్మకు ఎంతో ఇష్టమన్నారు. ఇంకా చెప్పాలంటే మా తల్లిదండ్రులు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమికులు ఎలా ఉంటారనే విషయం తండ్రితో పాటు తల్లికి కూడా తెలుసన్నారు. ఇక దీపికాతో విడిపోయానే విషయం ఇప్పుడెందకు చెబుతున్నానంటే మా బ్రేకప్‌కు మా అమ్మ కారణం కాదనే విషయం చెప్పడానికే ఈ  విషయాన్ని చెప్పానన్నారు. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్.. ఆలియా భట్‌తో డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే కదా.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 25, 2020, 5:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading