Ranbir Kapoor Corona positive: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో రోజురోజుకు కేసులు పెరుగతున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ విధించారు. వ్యాక్సిన్ వచ్చినప్పటికీ.. కరోనా నిర్దేశకాలను పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలోనూ కేసులు పెరుగుతున్నాయి. షూటింగ్లో పాల్గొంటున్న నటీనటులు పలువురు ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌కి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనతో పాటు ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి కూడా పాజిటివ్ సోకినట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అతడు హోం క్వారంటైన్లో ఉన్నారని.. అతడి తల్లికి పరీక్షల్లో నెగిటివ్‌గా తేలినప్పటికీ ఆమె కూడా సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారని వారు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఓ వైపు రణ్‌బీర్ మరోవైపు సంజయ్ లీలా భన్సాలీకి పాజిటివ్ రావడంతో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నట్లు సమాచారం. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో అలియా నటిస్తున్నారు. మరోవైపు తన ప్రియుడు రణ్‌బీర్‌తో ఇటీవల సమయాన్ని గడిపిన అలియా.. వీరిద్దరికి పాజిటివ్ అని తేలడంతో సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లినట్లు సమాచారం. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
కాగా ఆర్ఆర్ఆర్ మూవీతో అలియా భట్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనుండగా అతడి సరసన అలియా నటిస్తున్నారు. ఈ పాత్రకు అలియా మాత్రమే న్యాయం చేయగలదని అందుకే ఆమెను ఎంపిక చేసుకున్నట్లు గతంలో రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Alia Bhatt, Ranbir Kapoor