Alia Bhatt - Ranbir Kapoor: బాలీవుడ్‌లోని క్యూట్ ప్రేమ జంటల్లో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఒకరు. కత్రినాతో బ్రేకప్ తరువాత అలియాతో ప్రేమలో పడ్డారు రణ్‌బీర్. కాగా ఈ జంట తమ రిలేషన్‌ని ప్రకటించినప్పటి నుంచి వీరి పెళ్లిపై ఎన్నో సార్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు పెళ్లి.. అప్పుడు పెళ్లి అంటూ గత ఏడాది నుంచి ఇప్పటికీ ఈ గాసిప్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలను ఇరువురు ఖండిస్తూ వస్తున్నారు. పెళ్లికి అప్పుడే తొందర లేదని చెబుతూ వస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా తమ పెళ్లిపై రణ్‌బీర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మసంద్‌తో ఇంటర్వ్యూలో పాల్గొన్న రణ్‌బీర్.. తమ వివాహంపై మనసులోని మాటను బయటపెట్టారు. త్వరలోనే తమ పెళ్లి జరగనుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మహమ్మారి లేకుండా ఉండి ఉంటే ఈ పాటికే తామిద్దరి పెళ్లి జరిగి ఉండేదని రణ్‌బీర్ ఓ స్పష్టతను ఇచ్చారు. దీనిపై ఇంతకంటే ఇప్పుడు నేనేం చెప్పలేను. కానీ త్వరలోనే పెళ్లి చేసుకుందామనుకుంటున్నా అని పేర్కొన్నారు.
View this post on Instagram
ఇక లాక్డౌన్లో ఏవైనా ఆన్లైన్ క్లాస్‌లు నేర్చుకున్నారా..? అన్న ప్రశ్నకు.. నా గర్ల్‌ఫ్రెండ్ అలియాకు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఉత్సుకత ఎక్కువ. అందుకే గిటార్ మొదలు స్క్రీన్ రైటింగ్ వరకు చాలా క్లాస్‌లే తీసుకుంది. కానీ నాకు అంత ఆసక్తి లేదు. నేను ఏ క్లాస్‌లు తీసుకోలేదు. మొదట్లో మా ఇంట్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ తరువాత నేను పుస్తకాలకు ఎక్కువ సమయం కేటాయించా. నా కుటుంబంతో గడిపా. రోజుకు రెండు-మూడు సినిమాలను చూశా అని చెప్పుకొచ్చారు. కాగా లాక్డౌన్లో ఈ ఇద్దరు ఒకేచోట ఉన్నట్లు అప్పట్లో బాలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఇక రణ్‌బీర్ తండ్రి రిషి కపూర్ మరణించిన సమయంలోనూ అలియా.. ఆ ఫ్యామిలీతోనే ఉన్నారు. ఆ తరువాత కూడా వీరిద్దరు కలిసి ఉన్న ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి ఇక ఇటీవల రణ్‌బీర్, అలియాకు దగ్గరగా ఉండేలా ఒక ఫ్లాట్‌ను కొన్నట్లు సమాచారం.
కాగా బ్రహ్మాస్త్రలో రణ్‌బీర్, అలియా మొదటిసారిగా రొమాన్స్ చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్, డింపుల్ కపాడియా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షారూక్ ఖాన్ కూడా ఓ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీని కరణ్ జోహార్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మరోవైపు రాజమౌళి ఆర్ఆర్ఆర్ ద్వారా అలియా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Alia Bhatt, Bollywood, Ranbir Kapoor