హోమ్ /వార్తలు /సినిమా /

Brahmastra Twitter Review: ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే..

Brahmastra Twitter Review: ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే..

Brahmastra (Photo/ Twitter)

Brahmastra (Photo/ Twitter)

రియల్ కపుల్ ర‌ణ్‌బీర్ క‌పూర్‌ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) జంటగా నటించిన కొత్త సినిమా బ్రహ్మాస్త్ర. ఈ రోజే విడుదల చేసిన ఈ సినిమాపై ఆడియన్స్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అయాన్‌ ముఖర్జీ (Ayan Mukharji) దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ కేటాయించి బ్రహ్మాస్త్ర (Brahmastra) సినిమాను రూపొందించారు. రియల్ కపుల్ ర‌ణ్‌బీర్ క‌పూర్‌ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) జంటగా నటించిన ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో విడుదల కానుంది. ఈ భారీ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), మౌని రాయ్ (Mouni Roy), డింపుల్ కపాడియా (Dimple Kapadia), టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని (Nagarjuna Akkineni) కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మూడు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా బ్రహ్మాస్త్ర ఫస్ట్ పార్ట్ ఈ రోజే అనగా సెప్టెంబర్ 9వ తేదీ రిలీజ్ చేశారు. అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ దీనిపై ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఇంతకీ సినిమా ఎలా ఉంది? అనేది ట్విట్టర్ లో వస్తున్న కామెంట్స్ ఆధారంగా ఇప్పుడు చూద్దాం.


బ్రహ్మాస్త్రం సినిమాపై ట్విట్టర్ లో బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బ్రహ్మాస్త్ర సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ఓ వర్గం వారు హల్చల్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన బ్రహ్మాస్త్ర.. ప్రీమియర్స్ తో పాజిటివ్ టాక్ తెచ్చుకుందనే తెలుస్తోంది. అక్కడక్కగా నెగెటివ్ ట్రెండ్ కనిపిస్తున్నా ఈ సినిమాను చూడొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.చిత్రంలో క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ సీన్స్ అదిరిపోయాయని అంటున్నారు. ఫస్టాఫ్ విషయంలో ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుండేదనే కామెంట్స్ కనిపిస్తున్నాయి. లవ్ స్టోరీకి తగ్గ డైలాగ్స్ లేకపోవడం ఈ సినిమాను మైనస్ అంటున్నారు. అయాన్ ముఖర్జీ స్టోరీ నేరేషన్, యాక్టర్స్ పర్‌ఫార్‌మెన్స్ బాగున్నాయనే సందేశాలు కనిపిస్తున్నాయి.సింపుల్ స్టోరీని విజువల్ ఎఫెక్ట్స్‌తో వెండితెరపై ఆవిష్కరించారని, అయాన్ ముఖర్జీ టేకింగ్ బాగుందని చెబుతున్నారు ఆడియన్స్. అదేవిధంగా ఆలియా, ర‌ణ్‌బీర్ క‌పూర్‌ నడుమ కెమిస్ట్రీ హీటు పుట్టించిందని అంటున్నారు. చిత్రంలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మేజర్ అసెట్ అని చెబుతున్న ఆడియన్స్.. ఇది డీసెంట్ స్టోరీ అంటున్నారు. సో.. చూడాలి మరి ముందు ముందు ఈ సినిమా ఏ మేర రెస్పాన్స్ తెచ్చుకుంటుందనేది!.

Published by:Sunil Boddula
First published:

Tags: Alia Bhatt, Brahmastra, Nagarjuna Akkineni, Ranbir Kapoor

ఉత్తమ కథలు