RANBIR KAPOOR AS SHAMSHERA FIRST LOOK TEASER RELEASED RANBIR LOOK TERRIFIC LOOK IN MOVIE TA
Ranbir As Shamshera : అదిరిన ‘షంషేరా’ ఫస్ట్ లుక్ టీజర్.. గిరిజన వీరుడిగా రణ్‌బీర్ లుక్స్ అదుర్స్..
రణ్‌బీర్ కపూర్ ‘షంషేరా’ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల (Twitter/Photo)
Ranbir Kapoor As Shamshera : రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘షంషేరా’. ఈ సినిమా షూటింగ్ ఎపుడో కంప్లీటైంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్‌ను విడుదల చేశారు.
Ranbir Kapoor As Shamshera : రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంజు’ బయోపిక్ తర్వాత రణ్‌బీర్ కపూర్ నటించిన మరే సినిమా విడుదల కాలేదు. మధ్యలో కోవిడ్ ఇతరత్రా కారణాల వల్ల ఈయన నటించిన సినిమాలు ఆలస్యమయ్యాయి. అందుకే ఈయన నటించిన సినిమాలేవి విడుదలకు నోచుకోలేదు. ఇపుడు నాలుగేళ్ల తర్వాత వరుసగా తన సినిమాలతో పలకరించబోతున్నారు. ఇప్పటికే ఈయన అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మాణంలో ‘బ్రహ్మాస్త్ర’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ యేడాది 9 సెప్టెంబర్ విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను మూడు భాగాలుగా రానుంది. ఈ సినిమాలో నాగార్జున, అమితాబ్ బచ్చన్ మరో ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా కంటే ముందు ఈయన ‘షంషేరా’ మూవీతో పలకరించబోతున్నారు.
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్లో గిరిజన యోధుడి పాత్రలో రణ్‌బీర్ లుక్ అదిరిపోయింది. ఈ టీజర్లో కాజా నగరంలో గిరిజనులను బంధించి హింసించే శుద్ సింగ్ పాత్రలో సంజయ్ దత్ లుక్ అదిరిపోయింది. మొత్తంగా సినిమా విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. మొత్తంగా కేజీఎఫ్ మాదిరిగా ఈ సినిమా కాన్సెప్ట్‌గా ఉంది. విలన్ బంధించిన తన మనుషులను ఎలా విడిపించుకొని వారిపై తిరుగుబాటు చేసి పాత్ర షంషేరాగా రణ్‌బీర్ అదిరిపోయే నటనతో ఆకట్టుకున్నాడు.
‘కరమ్ సే డకేత్..ధరమ్ సే ఆజాద్’’. ఈ మూవీల రణ్ బీర్ కపూర్ రాబిన్ హుడ్ టైపు బందిపోటు దొంగగా పాత్రలో నటిస్తున్నారు. మొత్తానికి ‘షంషేరా’ మూవీని పూర్తి దేశీ..యాక్షన్ మసాలా ఎంటర్టేనర్ గా తెరకెక్కించారు. మరి ఈ మూవీలతో హీరోగా రణ్ బీర్ కపూర్... బాలీవుడ్లో ఎటువంటి ఫలితాలను అందుకుంటాడో చూడాలి.
2018లో మొదలైన ఈ సినిమా షూటింగ్ కరోనా ఇతరత్రా సమస్యల కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయింది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైయింది. షంషేరా సినిమాను కూడా ‘బ్రహ్మాస్త్ర’,ఆర్ఆర్ఆర్ తరహాలో ప్యాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. అప్పటికే వివిధ భాషల్లో ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేసారు.
ఇక రణ్‌బీర్ నటించిన ‘బ్రహ్మాస్త్ర’ విషయానికొస్తే.. మునుపెన్నడూ ఇండియన్ స్క్రీన్‌పై చూడని ఓ అద్భుతమైన విజువల్ ఫీస్ట్ ఈ సినిమా రానుంది. బ్రహ్మాస్త్ర 3-భాగాల ఫ్రాంచైజీగా రానుంది. మొట్టమొదటి అసలైన విశ్వం ఆస్ట్రావర్స్కు నాంది. ఇది భారతీయ పురాణాలలో లోతుగా పాతుకుపోయిన భావనలు, కథల నుంచి ప్రేరణ పొందిన ఒక కొత్త అసలైన సినిమా విశ్వం.. దాన్నే అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో చేస్తున్నారు. ఫాంటసీ, అడ్వెంచర్, మంచి vs చెడు, ప్రేమ, పురాణ కథాంశంతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉంటుంది. మొత్తంగా రణ్‌బీర్ కపూర్, నాగార్జునలకు ఇదే తొలి ప్యాన్ ఇండియా మూవీ అనే చెప్పాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.