బాలీవుడ్లో పెళ్లి సందడి నెలకొంది. కరోనా ఎఫెక్ట్‌తో ప్రతీ ఇంట కూడా పార్టీలు,పెళ్లిళ్లు, శుభకార్యాలన్నీ కళ తప్పాయి. కరోనా భయంతో కేవలం అతి తక్కువ మంది అతిథులతోనే పెళ్లిళ్లు జరిపించారు. అయితే ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ చాలా వరకు తగ్గిపోవడంతో అంతా ఇప్పుడు సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా చేసుకోవాలనుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్లో యంగ్ కపుల్ ప్రేమించి పెళ్లి చేసుకోబుతున్నారు. ప్రముఖ స్టార్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor ), హీరోయిన్ ఆలియా భట్(Alia Bhatt) గత కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట తాజాగా పెళ్లి పీటలెక్కనుంది. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరిద్దరూ ఏప్రిల్ 14వ తేదీన వెడ్డింగ్ (Wedding) బెల్స్ మోగించేందుకు రెడీ అయ్యారు. రెండు మూడేళ్లుగా వీరిద్దరి వివాహం గురించి మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఎట్టకేలకు వీరి వివాహం జరుగబోతుంది.
బాలీవుడ్ ప్రముఖులు, పలువురు సెలబ్రెటీలు ఈ పెళ్లి వేడుకలో పాల్గోనున్నారు. పలువురు ప్రముఖులకు ఇప్పటికే ఈ జోడీ ఆహ్వానం అందించారు. పెళ్లికి లిమిటెడ్ గా ఆహ్వానాలు అందించిన ఈ జంట రిసెప్షన్ కు మాత్రం ఎక్కువ మందిని ఆహ్వానించినట్లుగా బాలీవుడ్ టాక్. అయితే ఆలియా .. రణబీర్ ల పెళ్లి రిసెప్షన్‌కు చారాత్రాత్మక హోటల్ వేదిక కానుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు తమ పెళ్లి వేడుకల్ని చిరకాలం గుర్తుండిపోయేలా ప్యాలెస్‌లు, ప్రముఖ కోటాల్లో చేసుకున్న విషయం తెలిసిందే.అయితే తాజాగా ఈ జంట కూడా ముంబైలోని ప్రముఖ తాజ్ హోటల్లో రిసెప్షన్ నిర్వహించబోతున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చురుకుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే వారు ఈ విషయాన్ని అధికారికంగా మీడియాకు వెళ్లడించలేదు కాని లీక్ ఇచ్చారని తెలుస్తోంది.
ఆలియా భట్ మరియు రణబీర్ కపూర్ లు కలిసి ఏప్రిల్ 17న తాజ్ మహల్ హోటల్ లో సెలబ్రిటీల కోసం భారీ విందును ఏర్పాటు చేశారట. అయితే ప్రస్తుతం ఈ జంట రిసెప్షన్ ఏర్పాటు చేసిన తాజ్ మహల్ హోటల్‌పై గతంలో టెర్రరిస్టుల దాడి జరిగిన విషయం తెలిసిందే. ముంబయిలోని తాజ్ మహల్ ప్యాలెస్ (Taj Mahal Palace) హోటల్ పై 2008లో నవంబర్ 26న ఉగ్రవాదులు భీకర దాడి చేశారు. పదుల సంఖ్యలో ప్రాణాల్ని బలితీసుకున్నారు. ఈ ఘటన తర్వాత తాజ్ హోటల్‌కు వెళ్లాలంటేనే చాలామంది భయపడ్డారు. అక్కడ సాధారణ పరిస్థితులు రావడానికి చాలా సమయం పట్టింది. అయితే తాజాగా ఆలియ(Alia),రణ్‌బీర్(Ranbir) పెళ్లితో తాజ్ హోటల్ మళ్లీ వీరి పెళ్లి రిసెప్షన్ తో హడావుడి అక్కడ కనిపించబోతుంది. భారీ ఎత్తున పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న ఈ సమయంలోనే రిసెప్షన్ ను కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా బాలీవుడ్(Bollywood) వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
మరోవైపు రణ్‌బీర్ ఆలియాల రిలేషన్ సుదీర్ఘ కాలంగా కొనసాగాలంటూ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఆలియా విషయానికి వస్తే.. ఇటీవలే ఆర్ ఆర్ ఆర్(RRR) సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆలియా(Alia) త్వరలో మరో స్టార్ హీరో సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక హిందీలో కూడా ఆలియా ఫుల్ బిజీగా మారింది. ఇటీవలే గంగూబాయ్ కతియవాడి (gangubai kathiawadi) సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్రహ్మాస్త్ర సినిమా లో కూడా ఆలియా నటిస్తున్న విషయం తెల్సిందే. రణ్‌బీర్‌తో పెళ్లి తర్వాత కూడా ఆలియా తన సినిమా కెరీర్‌ను కొనసాగించనుంది.ల
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Alia Bhatt, Bollywood news, Ranbir Kapoor