ఇప్పుడు బాలీవుడ్లో ఒక్కటే హాట్ టాపిక్. అది ఆలియా భట్,రణ్ బీర్ కపూర్ (Alia Bhatt Ranbir Kapoor Wedding)పెళ్లి. ఈ సెలబ్రిటీ కఫుల్ మ్యారేజ్‌పై ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఈ జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమయ్యారు. పెళ్లి తేదీ కూడా ఈనెల 14నే అని తెలిసింది, అయితే ఇప్పుడు పెళ్లి తేదీపై మరోసారి డౌట్స్ వస్తున్నాయి. ఈ జంట పెళ్లి తేదీపై కొంత గందరగోళం నెలకొంది. ఈ జంట ఏప్రిల్ 14న పెళ్లి చేసుకోనున్నారని…కొన్ని మీడియాలో వార్తలు వస్తున్నాయి.మరికొందరు కాదు.. ఏప్రిల్ 15న జరుగుతుందని…అంటున్నారు. అసలు వీరి పెళ్లి ఎప్పుడు..? వీరికి వివాహానికి సంబంధించి రోజుకో కొత్త వార్త పుట్టుకోస్తుండటంతో ఫ్యాన్స్ గందరగోళంలో పడ్డారు.
అంతేకాదు రణబీర్(Ranbir), ఆలియాల (Alia) పెళ్లి వాయిదా పడిందనే టాక్ కూడా వినిపిస్తోంది. పెళ్లి ఎప్పుడు అనే వార్త కొంత గందరగోళానికి తెరలేపింది. అయితే ఈ విషయంపై నీతూ కపూర్ ప్రశ్నిస్తుంటే ఆమె స్పందించకపోవడం ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లు అర్థం అవుతోంది. ఆలియా భట్(Alia Bhatt) మేనమామ రాబిన్ భట్…ఏప్రిల్ 13న మెహందీ వేడుక జరుగుతుందని…పెళ్లి ఏప్రిల్ 14న జరుగుతుందని తెలిపాడు. అయితే తాజాగా ఇప్పుడు ఆలియా సోదరుడు రాహుల్ భట్(Rahul Bhatt)….వారి పెళ్లి తేదీ మారిందని ఓ న్యూస్ ఛానెల్ తో తెలిపాడు.
మొదట ఆలియా పెళ్లి ఏప్రిల్ 14న పెళ్లి అనుకున్నప్పటికీ…మీడియా(Media)కు తేదీ లీక్ కావడంతో…తేదీని మార్చాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ చెప్పాడు. భద్రత పరంగానే పెళ్లి తేదీని వాయిదా వేయడం ఒక కారణంగా చెబుతున్నారు. పెళ్లికి సంబంధించిన వార్త బయటకు లీక్ కావడంతోనే…పెళ్లి తేదీలను మార్చినట్లు రాహుల్ భట్ చెప్పాడు. మొత్తానికి ఏప్రిల్ 20లో ఏదొక తేదీలో పెళ్లి జరగడం ఖాయమని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి త్వరలో తేదిని ప్రకటిస్తామన్నారు. దీంతో ఇప్పుడు మీడియా సైతం ఆళియా భట్ పెళ్లిపై ఏం చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు పెళ్లి పనులు మాత్రం జరుగుతున్నాయి. దీంతో ఆలియా రణ్ బీర్ పెళ్లి జరుగుతుందా ? లేకపోతే వాయిదా పడుతుందా ?అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోన్న ప్రశ్న.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Alia Bhatt, Bollywood, Ranbir Kapoor