బాలీవుడ్ జంట ఆలియాభట్-రణ్‌బీర్ కపూర్ (Alia Bhatt- Ranbir Kapoor)ల వివాహం ఏప్రిల్ 14న ఘనంగా జరిగింది. వాస్తు అపార్ట్మెంట్లోని తమ నివాసంలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన పలు ఫొటోలు ఆలియా షేర్ చేసింది. అతికొద్దిమంది అతిథులతో ఈ జంట పెళ్లి వేడుకను జరుపుకున్నారు. దీంతో ఈ జంటకు బాలీవుడ్ సెలబ్రిటీలు.. పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లి తర్వాత జరిగిన మ్యారేజ్ రిసెప్షన్‌కు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. చాలామంది సెలబ్రిటీలు వీరికి విలువైన బహుమతులను పంపించారు. అయితే రణ్‌బీర్ కపూర్‌తో గతంలో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన హీరోయిన్లు రణ్ బీర్ కోసం లక్షల విలువైన గిప్ట్స్ పంపించారు.
రణ్‌బీర్ కపూర్‌తో ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన కత్రినా కైఫ్(Katrina Kaif)కొత్త దంపతులకు రూ.14.5 లక్షల విలువైన ప్లాటినం బ్రేస్‌లైట్‌ను బహుమతిగా ఇచ్చిందట. ఇక దీపికా పదుకొణె (Deepika Padukone)నూతన దంపతులకు విడివిడిగా ఖరీదైన వాచ్‌లను కానుకగా ఇచ్చిందట. ఇక దీపిక భర్త రణ్వీర్ సింగ్ లగ్జరీ బైక్‌ను రణ్‌బీర్ కపూర్‌కు గిఫ్ట్ గా ఇచ్చాడట. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాతోనే అలియా భట్ బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఈ చిత్రంతోనే ఆమెతో పాటు సిద్దార్థ్ మల్హోత్రా(sidharth malhotra), వరుణ్ ధావన్(Varun Dhavan) హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచే వీరందరూ మంచి స్నేహితులుగా మారిపోయారు.
అలియాకు రూ.మూడు లక్షల విలువ గల లగ్జరీ హ్యాండ్ బ్యాగును కానుకగా ఇచ్చాడు సిద్దార్థ్ మల్హోత్రా. వరుణ్ ధావన్ కూడా అలియాకు రూ. నాలుగు లక్షల ఖరీదు గల సాండల్స్‌ను గిఫ్ట్‌గా పంపించాడట. ప్రియాంక చోప్రా రూ. 9 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌ను కొత్త పెళ్లి కూతురుకు కానుకగా ఇచ్చింది. ఇక కరీనా కపూర్ రూ. మూడు లక్షల విలువ జేసే డైమండ్ నెక్లెస్‌ను బహుమతిగా అందించింది. ట. ఇక రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్ నూతన దంపతులకు ఏకంగా రూ.26కోట్ల విలువ జేసే విలాసవంతమైన ఫ్లాట్‌ను బహుమతిగా ఇచ్చారట. ఇక అలియా తల్లి సోనీ రజ్దాన్ అల్లుడికి రూ.2.5 కోట్ల ఖరీదైన వాచ్‌ను బహూకరించారట.
కరీనా కపూర్, కరిష్మా కపూర్, సైఫ్ అలీఖాన్, అయాన్ ముఖర్జీ, కరణ్ జొహర్, మలైకా అరోరా, అర్జున్ కపూర్, ఆకాశ్ అంబానీ తదితరులు ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో పాల్గొని సందడి చేశారు. వీరితో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియా వేదికగా అలియా- రణ్‌బీర్ (Alia Bhatt- Ranbir Kapoor)లకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Alia Bhatt, Deepika Padukone, Katrina Kaif, Ranbir Kapoor