హోమ్ /వార్తలు /సినిమా /

Brahmastra: బ్రహ్మాస్త్రం రివ్యూ: విజువల్‌‌గా ఓకే.. కానీ కథలో దమ్ము లేదు..

Brahmastra: బ్రహ్మాస్త్రం రివ్యూ: విజువల్‌‌గా ఓకే.. కానీ కథలో దమ్ము లేదు..

Ranbir kapoor Alia bhatt Brahmastra movie review Photo : Twitter

Ranbir kapoor Alia bhatt Brahmastra movie review Photo : Twitter

Brahmastra Review: హిందీ ఇండస్ట్రీ నుంచి వస్తోన్న మోస్ట్ క్రేజీ మూవీ బ్రహ్మాస్త్ర. రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించారు. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదలైంది. అయాన్ ముఖ‌ర్జీ దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రివ్యూ : బ్రహ్మాస్త్ర (Brahmāstra Review)నటీనటులు : రణబీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, నాగార్జున, షారూఖ్ ఖాన్, డింపుల్ కపాడియా, తదితరులు..
ఎడిటర్: ప్రకాష్ కురుప్
సినిమాటోగ్రఫీ: వి. మణికందన్, పంకజ్ కుమార్, సుదీప్ ఛటర్జీ
సంగీతం: ప్రీతమ్, సైమన్ ఫ్రాంగ్లెన్
నిర్మాతలు : కరణ్ జోహార్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా, అయాన్ ముఖర్జీ
దర్శకత్వం: అయాన్ ముఖర్జీ
విడుదల తేది : సెప్టెంబర్ 09, 2022 
హిందీ ఇండస్ట్రీ నుంచి వస్తోన్న మోస్ట్ క్రేజీ మూవీ బ్రహ్మాస్త్ర. రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించారు. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదలైంది. అయాన్ ముఖ‌ర్జీ దర్శకత్వం వహించారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించారు. క‌ర‌ణ్ జోహార్‌, ర‌ణ్‌బీర్ క‌పూర్‌, అయాన్ ముఖ‌ర్జీ, అపూర్వ మెహ‌తా, న‌మిత్ మ‌ల్హోత్రా నిర్మించారు. ఈ చిత్రంలో రణ‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), ఆలియా భట్‌ (Alia Bhatt) తొలిసారి జంటగా కనించనుండటం విశేషం. ప్రీతమ్ సంగీతం అందించారు. ఈ ఫాంటసీ అడ్వెంచర్‌ చిత్రాన్ని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి స‌మ‌ర్పిస్తుండటం మరో విశేషం. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం నేడు రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..
కథ :
బ్రహ్మాస్త్ర కథ విషయానికి వస్తే.. ట్రైలర్‌లో చూపించనట్లే.. అస్త్రాలన్నిటికీ అధిపతిగా బ్రహ్మాస్త్ర ఉంటుంది. అయితే ఈ బ్రహ్మాస్త్రని మూడు భాగాలుగా చేసి దుష్టులకు అందకుండా బ్రహ్మాన్ష్‌ అనే గ్రూప్ రక్షిస్తూ ఉంటుంది. ఇక బ్రహ్మాస్త్ర లోని ఒక భాగం బ్రహ్మాన్ష్‌ గ్రూప్‌కు చెందిన అనీష్ (నాగార్జున అక్కినేని) చేతికి ఉంటుంది. బ్రహ్మాస్త్ర రెండో భాగం సైంటిస్ట్ (షారుఖ్ ఖాన్) మోహన్ భార్గవ్‌ దగ్గర ఉంటుంది. ఇక మూడో భాగం ఎవరి దగ్గరి ఉంది.. ఎక్కడ ఉందనేది కథ. ఇక మరోవైపు ఈ మూడు భాగాలను కలిపి ఆ బ్రహ్మాస్త్ర ని దక్కించుకోవాలనీ మరో గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్.. బ్రహ్మాన్ష్‌ గ్రూప్‌కు చెందినవారిని వేటాడుతూ బ్రహ్మాస్త్ర భాగాలు కోసం వెతుకుతూ ఉంటుంది. మరి ఈ సినిమాలో శివ (రణబీర్‌ కపూర్‌), ఇషా(ఆలియా భట్)‌ల రోల్ ఏంటీ.. గురూజీ (అమితాబ్ బచ్చన్) ఎవరు.. ఈ ముగ్గురు కలిసి ఎలా ఆ విలన్ గ్రూప్‌ను అడ్డుకున్నారు.. అనేది కథ..
కథనం :   రణబీర్, అమితాబ్ బచ్బన్, ఆలియా భట్, షారుఖ్ ఖాన్, నాగార్జున, మౌనీ రాయ్.. వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా అనుకున్న రేంజ్‌లో మాత్రం లేదు. అయితే మంచి విజువల్స్‌తో పాటు భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ఆకట్టుకుంటాయి. కానీ కథ, కథనంలో దమ్ము లేదు. దీంతో సినిమా పెద్దగా ఆకట్టుకోదు. మొత్తంగా ఈ సినిమా విజువల్స్ పరంగా వావ్ అనిపించినా, కంటెంట్ ఓ మోస్తరుగా ఉండడంతో ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోవచ్చు.
సాంకేతిక విభాగం : బ్రహ్మాస్త్రలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. సినిమాటోగ్రఫీ. విజువల్ పరంగా సినిమా ఓ రేంజ్‌లో ఉంటుంది. దీనికి తోడు యాక్షన్ సన్నివేశాల అద్భుతంగా చిత్రీకరించారు చిత్రబృందం. ఎడిటింగ్ ఇంకాస్తా షార్ప్‌గా ఉంటే బాగుండేది. పాటలు ఓకే ఓకేగా ఉంటాయి. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువల విషయానికి వస్తే.. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా నిర్మించారు.
ఫ్లస్ పాయింట్స్ : 
భారీ తారాగణం, విజువల్స్..
రణబీర్ కపూర్, షారుఖ్ ఖాన్, నాగార్జున, అమితాబ్ బచ్చన్‌, ఆలియా భట్‌‌ల నటన..
మైనస్ పాయింట్స్ :
కథ వీక్‌గా ఉండడం..
సెకండ్ హాఫ్‌లో వచ్చే సన్నివేశాలు..
హీరో, హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్ ..
చివరి మాట : విజువల్స్ సూపర్.. కథే వీక్..
రేటింగ్: 2/5

Published by:Suresh Rachamalla
First published:

Tags: Alia Bhatt, Brahmastra, Ranbir Kapoor, Tollywood news

ఉత్తమ కథలు