హోమ్ /వార్తలు /సినిమా /

Pawan Kalyan : పవన్ మలయాళ రీమేక్‌లో నటించడంపై రానా ఇంకా నిర్ణయం తీసుకోలేదా..

Pawan Kalyan : పవన్ మలయాళ రీమేక్‌లో నటించడంపై రానా ఇంకా నిర్ణయం తీసుకోలేదా..

పవన్ కళ్యాణ్, రానా Photo : Twitter

పవన్ కళ్యాణ్, రానా Photo : Twitter

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలకు ఓకే చెప్పుతున్నాడు. ఆయన ఇప్పటికే ‘వకీల్ సాబ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలకు ఓకే చెప్పుతున్నాడు. ఆయన ఇప్పటికే ‘వకీల్ సాబ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా హిందీ సినిమా పింక్‌కు రీమేక్ గా వస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా ఇంకొన్ని రోజుల్లో మొత్తం షూటింగ్ ముగియనుంది. ఈ సినిమా తర్వాత ఆయన మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ స్టార్ట్ చేస్తారు. ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ సుమారు 40 రోజులు డేట్స్ కేటాయించారట. ఈ సినిమాలో పవన్‌తో పాటు మరో కీలక పాత్రలో రానా నటిస్తున్నాడని టాక్ నడిచిన సంగతి తెలిసిందే. అయితే దీని గురించి అధికారికంగా సమాచారం లేదు. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు రానాను ఆ క్యారెక్టర్ కోసం చిత్రబృంద సంప్రదించిదట. కానీ ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. రానా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే రానాకు మాత్రం ఆ పాత్ర బాగా నచ్చిందట. చూడాలి మరి ఈ పాత్రలో నటించడానికి రానా ఒకే చెపుతాడో లేదో. అన్నీ కుదిరితే ఆయనే సినిమాలో నటిస్తారని అర్థమవుతోంది. ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. ఇక ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్‌గా సాయి పల్లవి నటించనుందని మొన్నటి దాకా టాక్ నడవగా.. తాజాగా ఈ పాత్రలో తెలుగందం అంజలి కనపిపంచనుందని తెలుస్తోంది. . ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

  ఇక పవన్ నటిస్తోన్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఎన్నికలకు సమయం ఉన్నందున.. పవన్ ఆ ఖాలీ సమయాన్ని సినిమాలకు వెచ్చిస్తున్నాడు. అందులో భాగంగా ఆయన హిందీలో సూపర్ హిట్ అయినా పింక్‌ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. అక్కడ అమితాబ్ చేసిన పాత్రలో పవన్ కనిపించనున్నాడు. వకీల్ సాబ్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను దిల్ రాజు, బోణి కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈ సినిమాతో పాటు పవన్ మరో రెండు సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తోన్న సినిమా ఒకటి. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈ సినిమా. ఏ ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ మూవీగా వస్తోంది. కొంత షూటింగ్ కూడ జరుపుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో ఈసినిమాను పాన్ ఇండియా లెవల్‌లో అప్పీల్ కావడంతో అన్ని భాషాల్లో విడుదల చేయనుంది చిత్రబృందం. విరూపాక్ష అనే పేరును పరిశీలిస్తోంది చిత్రబృందం.

  ఇక కథ విషయానికి వస్తే రాబిన్ హుడ్ తరహాలో ఉన్నవారిని కొట్టి, పేద వారికి అండగా ఉంటాడట హీరో. అందులో భాగంగా ఈ సినిమాలో హీరో పవన్ బందిపోటు పాత్రలో కనిపించనున్నాడట. ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు వీర అని ఓ వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. ఇక ఈ పీరియాడిక్ మూవీలో బాలీవుడ్ భామ జాక్వీలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాతో పాటు పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాను చేయనున్నాడు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సివుంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Pawan kalyan, Rana daggubati, Tollywood news

  ఉత్తమ కథలు