Home /News /movies /

RANA SAI PALLAVI VIRATAPARVAM CENSOR CERTIFICATE AND RUN TIME SLB

Virataparvam సెన్సార్ సర్టిఫికెట్.. సినిమా రన్ టైమ్ ఎంతంటే? ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్టులు వీళ్ళే..

Photo Twitter

Photo Twitter

Virataparvam Pre Release event: దగ్గుబాటి రానా హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన విరాటపర్వం సినిమా నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లోని సన్నివేశాలు, డైలాగ్స్ రోమాలు నిక్కబొచేలా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు బయటకొచ్చాయి.

ఇంకా చదవండి ...
దగ్గుబాటి రానా ( Daggubati rana) హీరోగా రూపొందిన కొత్త సినిమా 'విరాటపర్వం' (Virata Parvam). వేణు ఊడుగుల (Venu Udugula) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రానాతో నాచురల్ క్వీన్ సాయి పల్లవి (Sai Pallavi) తెరపంచుకుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా వాయిదాల పర్వం కొనసాగింది. చివరకు జూన్ 17న (Virata Parvam Release Date) ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టిన యూనిట్.. ఆసక్తికర అప్‌డేట్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా నగాదారిలో సాంగ్ (Nagaadaarilo Song) లిరికల్ వీడియో వదిలిన మేకర్స్ తాజాగా విరాటపర్వం ట్రైలర్ (Virata Parvam Trailer) రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశారు.

ఈ సినిమా కామ్రేడ్‌ రవన్నగా రానా నటిస్తుండగా.. వెన్నెలగా సాయి పల్లవి తన నాచురల్ నటనతో అట్రాక్ట్ చేసింది. ఆలోచింపజేసే సన్నివేశాలతో పాటు ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ హైలైట్ చేసి ఈ సినిమా ట్రైలర్ వదిలారు. ఇందులో సీనియర్‌ ఉద్యమకారుడు రఘన్నగా నవీన్‌ చంద్ర, కామ్రేడ్‌ భరతక్కగా ప్రియమణి కనిపించారు. ''చిన్న ఎవడు పెద్ద ఎవడు రాజ్యమేలే రాజు ఎవ్వడు.. సామ్యవాద పాలన స్థాపించగ ఎళ్లినాడు'' అనే పవర్ ఫుల్ డైలాగ్‌తో ప్రారంభించి ప్రతి ఒక్క సన్నివేశాన్ని రక్తి కట్టించారు. ''అతన్ని చూడాలని ఉందమ్మా.. నువ్వు గనక కనిపించేలా చేస్తే కొన్ని కోసి కల్లు శాక పోస్తా.. నాలో ఏదో భావోద్వేగం రగులుతోంది.. ఈ భావోద్వేగానికి ఏ పేరు పెట్టాలో కూడా తెలియడం లేదు'' అంటూ సాయి పల్లవి చెప్పిన డైలాగ్స్ ఈ వీడియోలో హైలైట్ అయ్యాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ వదిలారు మేకర్స్. చిత్రానికి UA సర్టిఫికెట్ వచ్చింది. ఇకపోతే ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 31 నిమిషాలు అని ఈ సర్టిఫికెట్ లో పేర్కొన్నారు. ఇకపోతే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు వెంకటేష్, రామ్ చరణ్, సుకుమార్ ముఖ్య అతిథులుగా రానున్నారు.



శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్ సంస్థల సంయుక్త సమర్పనిచ్చారుణలో రూపొందిన ఈ సినిమాకు డీ సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మాతలుగా వ్యవహరించారు. చిత్రంలో నందితా దాస్, ప్రియమణి, నవీన్ చంద్ర, జరీనా వాహబ్, ఈశ్వరి రావు, సాయి చంద్ ముఖ్యపాత్రలు పోషించారు.
Published by:Sunil Boddula
First published:

Tags: Rana daggubati, Sai Pallavi, Virata Parvam

తదుపరి వార్తలు